Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 4th కరెంట్ అఫైర్స్
Thapi Dharmarao award 2022: ప్రముఖ కార్టూనిస్టు సరసికి బహూకరణ
తెనాలి: పట్టణానికి చెందిన తెలుగు జాతి ట్రస్ట్ ఆధ్వర్యంలోని తాపీ ధర్మారావు వేదిక నిర్వహణలో ఏటా బహూకరిస్తున్న తాపీ ధర్మారావు పురస్కార ప్రదానోత్సవం నవంబర్ 5వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నారు. వివిధ సామాజిక సమస్యలపై వేలాది కార్టూన్లతో ప్రజల్లో చైతన్యం కలిగించిన చిత్రకారుడు సరస్వతుల రామనరసింహం (సరసి)కి 2022 సంవత్సరానికి తాపీ పురస్కారం అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి ముఖ్యఅతిథిగా హాజరై తాపీ ధర్మారావు పురస్కారాన్ని సరసికి బహూకరిస్తారు. ఇదే వేదికపై సరసి రూపొందించిన ‘అమ్మ నుడిని అటకెక్కిస్తారా’ కార్టూన్ల పుస్తకాన్నీ ఆయన ఆవిష్కరిస్తారు. రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, హైకోర్టు న్యాయవాది, కార్టూనిస్టు అన్నం శ్రీధర్, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, తమ్మా శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు.
Also read: AP: విద్యలో అగ్రగామి.. తొలిసారి ‘లెవెల్–2’సాధించిన ఆంధ్రప్రదేశ్
కవి పండితుడు, విమర్శకుడు, పత్రికా సంపాదకుడు, సినీరచయిత అయిన తాపీ ధర్మారావు తెలుగు భాషకు చేసిన సేవలకు గుర్తింపుగా వెన్నిసెట్టి రంగారావు, సామల లక్ష్మణబాబు నిర్వహణలోని వేదిక ఆధ్వర్యంలో ఏటా ఒక్కో నగరంలో తాపీ ధర్మారావు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. 2009 నుంచి తాపీ ధర్మారావు పురస్కారాన్ని స్వీకరించిన వారిలో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, డాక్టర్ కె.శ్రీనివాస్, టంకశాల అశోక్, జి.శ్రీరామమూర్తి ఎ.కృష్ణారావు, ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు, సతీష్‌చందర్, డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ (జీవన సాఫల్య పురస్కారం), యల్లపు ముకుంద రామారావు, డీపీ అనూరాధ ఉన్నారు.
2022 సంవత్సరానికి పురస్కారం స్వీకరించనున్న సరసి, వేలాది కార్టూన్ల రచనలతో వార్తాపత్రికల చదువరులకు చిరపరిచితుడు. వీరిది పశ్చిమగోదావరి జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సహాయ కార్యదర్శిగా పనిచేశారు. ప్రవృత్తిగా సరసి కలం పేరుతో కార్టూన్లు, కథలు, రేడియో నాటికలు రాస్తున్నారు. సంగీతం, చిత్రలేఖనంలోనూ ప్రవేశముంది. తాజా పుస్తకంతో కలిపి ఆయన కార్టూన్లు 10 సంకలనాలుగా వెలువడ్డాయి. ఒక వారపత్రికలో 15 ఏళ్లపాటు నిర్వహించిన కార్టూన్ల శీర్షిక ‘మనమీదేనర్రోయ్’ విశేష పాఠకాదరణ పొందింది. తన కార్టూన్లకు రెండు జాతీయ అవార్డులు, నాలుగు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఇక రాష్ట్రస్థాయి అవార్డులకు కొదవలేదు.
Also read: YSR Awards 2022 : విజయవాడలో ఘనంగా పురస్కారాల ప్రదానోత్సవం
State Govt Programme: మహారాష్ట్రకు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు: మోదీ
ముంబై: మహారాష్ట్రలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల వల్ల కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సుమారు 75 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసేందుకు నవంబర్ 3న ముంబైలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపించారు.
Also read: One Nation One Uniform : పోలీసులకి ఒకే యూనిఫాం ఉండాలి : మోదీ
Zaporizhzhia nuclear power station: ఉక్రెయిన్ విద్యుత్.. ‘రష్యా’ ప్రాంతాలకు !
కీవ్: యూరప్‌లోనే పెద్దదైన ఉక్రెయిన్‌లోని జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం నుంచి దేశీయ పవర్ గ్రిడ్‌కు అనుసంధానంగా ఉన్న విద్యుత్ లైన్లు రష్యా దాడుల్లో ధ్వంసమయ్యాయి.
దాడుల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థలో పెద్దస్థాయిలో నష్టం జరిగిందని ఉక్రెయిన్ అణువిద్యుత్ అధీకృత సంస్థ ఎనర్గోటామ్ నవంబర్ 3న వెల్లడించింది. ‘అణు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌కు వెళ్లే లైన్లను క్షిపణులతో ధ్వంసంచేశారు. రష్యా గ్రిడ్‌తో అనుసంధానించేందుకు కుట్రకు తెరలేపారు. భవిష్యత్‌లో ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రష్యా ఆక్రమిత క్రిమియా, డోన్బాస్ ప్రాంతాలకు తరలించేందుకు ఆ వైపు లైన్లను పునరుద్ధరిస్తున్నారు’ అని ఎనర్గోటామ్ టెలిగ్రామ్ చానెల్‌లో ఆరోపించింది.
ICBM: ఆగని ఉత్తర కొరియా క్షిపణులు
సియోల్: ఉత్తరకొరియా క్షిపణుల ప్రయోగ పరంపర గురువారమూ కొనసాగింది. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) సహా కనీసం ఆరుక్షిపణులను ప్రయోగించింది. తాజా పరిణామంతో జపాన్ ఉలిక్కిపడింది. రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతోపాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కోరింది. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని ఓ ప్రాంతం నుంచి నవంబర్ 3న ఉదయం 7.40 గంటలకు ఒక ఐసీబీఎంను, ఒక గంట తర్వాత అక్కడికి సమీపంలోని కచియోన్ నుంచి రెండు తక్కువ శ్రేణి మిస్సైళ్లను ఉత్తరకొరియా ప్రయోగించినట్లు దక్షిణకొరియా సైన్యం ధ్రువీకరించింది. పొరుగు దేశాల భూభాగాల్లోకి ప్రవేశించకుండా నివారించేందుకు ఐసీబీఎంను ఎత్తులో ప్రయోగించి ఉండవచ్చని తెలిపింది.
Also read: Korean Missile: కొరియాల క్షిపణి పరీక్షలు
ఈ క్షిపణి 2 వేల కిలోమీటర్ల ఎత్తులో 750 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటుందని జపాన్ పేర్కొంది. తమ గగనతలం మీదుగా మాత్రం వెళ్లలేదని తెలిపింది. ఈ ప్రయోగంతో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం ..అండర్‌గ్రౌండ్ లేదా పటిష్టమైన భవనాల్లోకి వెళ్లి తలదాచుకోవాలంటూ మియాగి, యమగట, నిగట ప్రిఫెక్చర్ల ప్రజలను కోరింది. ఆయా ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం క్షిపణి ప్రయోగాలపై ఉత్తరకొరియా ఒక ప్రకటన చేసింది. దక్షిణకొరియా, అమెరికాలు సైనిక విన్యాసాలను కొనసాగించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. తర్వాత మరో 3 క్షిపణుల్ని ప్రయోగించింది.
Also read: North Korea క్షిపణి ప్రయోగం
Compliant Management System: అవినీతిపరులను అరికట్టేందుకు.. ‘కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ పోర్టల్ ప్రారంభం..
న్యూఢిల్లీ: అవినీతిని అరికట్టే విషయంలో కఠినంగా వ్యవహరించాలని అవినీతి వ్యతిరేక సంస్థలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నీతిమాలిన వ్యవహారాలను నియంత్రించేటప్పుడు స్వార్థపరులు దర్యాప్తు సంస్థలకు మకిలి అంటించే ప్రయత్నం చేస్తుంటారని, సవాళ్లు ఎదురైనా ఆత్మరక్షణలో పడిపోవద్దని చెప్పారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహనా వారోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అవినీతిపరులు ఎంత గొప్పవారైనా సరే వదిలిపెట్టొద్దని సీవీసీతోపాటు ఇతర సంస్థలకు, అధికారులకు సూచించారు. అక్రమార్కులు రాజకీయంగా, సామాజికంగా రక్షణ పొందకుండా చూడాల్సిన బాధ్యత సీవీసీలాంటి సంస్థలపై ఉందన్నారు.
ప్రతి అవినీతిపరుడిని జవాబుదారీగా మార్చడం సమాజం విధి అని చెప్పారు. అలాంటి వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యమని తెలిపారు. తప్పుడు పనులకు పాల్పడినవారు ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రముఖులుగా చెలామణి అవుతూ యథేచ్ఛగా తిరుగుతున్నారని, జనం సైతం వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారని, మన సమాజానికి ఇలాంటి పరిణామం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు.
Also read: 3,024 కొత్త ఫ్లాట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు
ఆ జాడ్యాలను వదిలిస్తున్నాం..
సీవీసీ లాంటి సంస్థలు దేశ సంక్షేమానికి పాటుపడుతున్నాయని, నిజాయితీగా పని చేస్తున్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ చెప్పారు. మనం రాజకీయ అజెండాతో పనిచేయడం లేదని, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే మన బాధ్యత అని ఉద్బోధించారు. అవినీతి వ్యతిరేక సంస్థలు తమ ఆడిటింగ్, ఇన్‌స్పెక్షన్లను టెక్నాలజీ సాయంతో ఆధునీకరించుకోవాలని సూచించారు. అవినీతిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించడం లేదని గుర్తుచేశారు. ప్రభుత్వ శాఖలు, విభాగాలన్నీ అవినీతిపై యుద్ధం చేయాలన్నారు.
Also read: Global Investors' Meet 2022: ప్రపంచం ఆశలన్నీ భారత్‌పైనే జీఐ సదస్సులో మోదీ వ్యాఖ్యలు
దేశం అభివృద్ధి చెందాలంటే అవినీతిని సహించలేని పరిపాలనా వ్యవస్థ కావాలన్నారు. ప్రభుత్వ అధినేతగా కొనసాగుతున్న తనపైనా ఎన్నోసార్లు బురద చల్లారని, దూషించారని తెలిపారు. నిజాయతీ, నిర్భీతిగా పనిచేస్తే ప్రజలు మన వెంటే మద్దతుగా నిలుస్తారని వివరించారు. బ్రిటిషర్ల పాలనలో ఆరంభమైన అవినీతి, దోపిడీ, వనరులపై గుత్తాధిపత్యం వంటి జాడ్యాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగాయని, గత ఎనిమిదేళ్లుగా సంస్కరణల ద్వారా వాటిని వదిలిస్తున్నామని, పాలనలో పారదర్శకతను ప్రవేశపెట్టామని వెల్లడించారు.
Also read: Mangarh Dham : ఇక జాతీయ స్మారక చిహ్నం
ఫిర్యాదుల స్థితిగతులపై పోర్టల్
సీవీసీ ఆధ్వర్యంలో నూతన ‘కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ పోర్టల్‌ను మోదీ ప్రారంభించారు. అవినీతిపై తాము ఇచ్చిన ఫిర్యాదుల స్థితిగతులను ఈ పోర్టల్ ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ‘ఎథిక్స్, గుడ్ ప్రాక్టీసెస్: కంపైలేషన్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆన్ ప్రివెంటివ్ విజిలెన్స్’ అనే అంశంపై పుస్తకాలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ‘అభివృద్ధి చెందిన దేశం కోసం అవినీతి రహిత భారతం’ అనే అంశంపై సీవీసీ దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజేతలుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులకు అవార్డులు అందజేశారు.
Asian Continental Chess: ఆసియా చెస్ చాంపియన్‌షిప్‌లో హర్ష, ప్రియాంకలకు రజత పతకాలు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక అదరగొట్టారు. నవంబర్ 3న ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో ఓపెన్ విభాగంలో 22 ఏళ్ల హర్ష 6.5 పాయింట్లతో రెండో స్థానంలో... మహిళల విభాగంలో ప్రియాంక 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాలను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే చెస్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించారు. ఓపెన్ విభాగంలో భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద 7 పాయింట్లతో... మహిళల విభాగంలో భారత్‌కే చెందిన పీవీ నందిథా 7.5 పాయింట్లతో చాంపియన్స్‌గా అవతరించారు. ఓపెన్ విభాగంలో టాప్–4 ప్లేయర్లు, మహిళల విభాగంలో టాప్–2 క్రీడాకారిణులు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించారు.
Also read: Aimchess Rapid Online Tournament: అర్జున్ సంచలనం... ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్‌పై విజయం
నవంబర్ 3న జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో భారత్‌కే చెందిన కార్తీక్ వెంకటరామన్‌తో తలపడిన 22 ఏళ్ల హర్ష భరతకోటి 14 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆధిబన్‌తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నిర్ణిత తొమ్మిది రౌండ్ల తర్వాత హర్షతోపాటు ఆధిబన్, నారాయణన్, వొఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), సేతురామన్, కార్తీక్ వెంకటరామన్ 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్ష రెండో ర్యాంక్‌లో, ఆధిబన్ మూడో ర్యాంక్‌లో, నారాయణన్ నాలుగో ర్యాంక్‌లో, వొఖిదోవ్ ఐదో ర్యాంక్‌లో, సేతురామన్ ఆరో ర్యాంక్‌లో, కార్తీక్ ఏడో ర్యాంక్‌లో నిలిచారు. ఈ టోర్నీలో హర్ష అజేయంగా నిలిచాడు. నాలుగు గేముల్లో గెలిచిన అతను మిగతా ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.
Also read: National Open Under-23 Athletics Championshipలో నందినికి స్వర్ణం
మహిళల విభాగంలో విజయవాడకు చెందిన 20 ఏళ్ల ప్రియాంక చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో 47 ఎత్తుల్లో భారత్‌కే చెందిన పద్మిని రౌత్‌ను ఓడించింది. ప్రియాంకతోపాటు దివ్య దేశ్‌ముఖ్ (భారత్), వో థి కిమ్ ఫుంగ్ (వియత్నాం) 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ప్రియాంకకు రజతం, దివ్య దేశ్‌ముఖ్‌కు కాంస్యం లభించాయి. ఈ టోరీ్నలో ప్రియాంక ఆరు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓటమి చవిచూసింది.
MEIL: ‘మేఘా’కు మంగోలియా తొలి గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ మౌలిక సదుపాయాల దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియా మార్కెట్లో అడుగుపెట్టింది.
దేశీయంగా తొలి గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీని నిర్మించే భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. దీని విలువ 790 మిలియన్ డాలర్లు. మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్‌వోఏ (లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెపె్టన్సీ)ను అందుకున్నట్లు ఎంఈఐఎల్ తెలిపింది.
Also read: CAG Audit Report: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై CAG లెక్కలు
ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) ప్రాతిపదికన ఈ కాంట్రాక్టు కింద ఓపెన్ ఆర్ట్ యూనిట్లు, యుటిలిటీలు, ప్లాంటు భవంతులు, క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు మొదలైనవి నిర్మించాల్సి ఉంటుందని వివరించింది.
ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ రిఫైనరీలో రోజుకు 30,000 బ్యారెల్స్, ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేయవచ్చు.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) తలపెట్టిన భాగస్వామ్య అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా, భారత ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో మంగోలియా ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్) ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించనుంది.
Also read: Digital Rupee: ఈ–రూపాయిపై పరీక్షలు మొదలు
ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు, హైడ్రోకార్బన్స్ రంగంలో తమ వ్యాపార విస్తరణ వ్యూహాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా ఉండగలదని కంపెనీ తెలిపింది. దీనితో రష్యన్ ఇంధనంపై మంగోలియా ఆధారపడటం తగ్గుతుందని, అలాగే తమ పెట్రోలియం ఉత్పత్తుల అవసరాలను స్వయంగా తీర్చుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. స్థానికంగా చిన్న పరిశ్రమలు, ప్రజల ఉపాధి అవకాశాల వృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.
Assago Bio Ethanol Plant: రాజమహేంద్రవరానికి సమీపంలో రూ.270 కోట్లతో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు..
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 4న శంకుస్థాపన చేసారు.
Also read: Fraudulent Loan Apps: మోసకారి లోన్ యాప్‌లపై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్ సెంటర్: సీఏం జగన్
రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Also read: Arogyasri 2.0 : రెట్టింపు భరోసా - ఇక 3,255 చికిత్సలకు వర్తింపు
ప్రస్తుతం లీటరు పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం సగటున 8.41 శాతంగా ఉంది. కోటిలీటర్ల ఇథనాల్‌ను వినియోగించడం ద్వారా 20 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నట్లు అనేక పరిశీలనల్లో వెల్లడైంది. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించడంతో అనేక సంస్థలు ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి.
భూ కేటాయింపుల దగ్గర నుంచి అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ చూపిందని, ఈ పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అస్సాగో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ గుర్నానీ తెలిపారు. భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Also read: E-Mobility week celebration: హైదరాబాద్ నగరంలో ఈ-మొబిలిటీ వారోత్సవాలు
ఈ యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్‌ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్ధికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు.
బయో ఇథనాల్‌లో రూ.2,017 కోట్ల పెట్టుబడులు
రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి.అస్సాగోతో పాటు క్రిభ్‌కో, ఇండియన్ ఆ యిల్ కార్పొరేషన్, ఎకో స్టీల్, సెంటిని, డాల్వకో ట్, ఈఐడీ ప్యారీ వంటి సంస్థలు కలిపి సుమారు రూ.2,017 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి.
Also read: Ramco Cements కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం జగన్
హరిత ఇంధనానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రం గంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా బయో ఇథనాల్ పాలసీని రూపొందిస్తోంది. ఇప్పటికే ముసాయిదా పాలసీ తయారుచేసిన రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య కంపెనీల సూచనలు, సలహాలు తీసుకుని త్వరలోనే పాలసీని విడుదల చేయనుంది. దీనిద్వారా బయో ఇథనాల్ తయారీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావం ఉంది.
Also read: Andhra Pradesh Economy: తొలిసారిగా రూ.2 లక్షలు దాటిన ఏపీ తలసరి ఆదాయం
ఇథనాల్ తయారీకి ముందుకొచ్చిన సంస్థలు
సంస్థ పెట్టుబడి (రూ.కోట్లల్లో)
క్రిభ్‌కో 560
ఐవోసీ 600
అస్సాగో 270
ఎకో స్టీల్ 280
సెంటిని 130
డాల్వకోట్ 84
ఈఐడీ ప్యారీ 93
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP