Skip to main content

Aimchess Rapid Online Tournament: అర్జున్‌ సంచలనం... ప్రపంచ చాంపియన్‌ కార్ల్‌సన్‌పై విజయం

చెన్నై: ఎయిమ్‌చెస్‌ ర్యాపిడ్‌ ఆన్‌లైన్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ సంచలనం సృష్టించాడు.
Indian grandmaster Arjun defeats five time world Chess
Indian grandmaster Arjun defeats five time world Chess

ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌లో అర్జున్‌ 54 ఎత్తుల్లో గెలిచాడు. డూడా (పోలాండ్‌)తో జరిగిన ఎనిమిదో రౌండ్‌ గేమ్‌ను అర్జున్‌ 45 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. 16 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఎనిమిదో రౌండ్‌ తర్వాత అర్జున్‌ 15 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. 

ఈ టోర్నీ నిబంధనల ప్రకారం విజయం సాధిస్తే మూడు పాయింట్లతోపాటు 750 డాలర్లు (రూ. 61 వేలు), ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్‌తోపాటు 250 డాలర్లు (రూ. 20 వేలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి.   

Also read: ISSF World Championship 2022:18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్‌ రుద్రాంక్ష్

Published date : 17 Oct 2022 06:20PM

Photo Stories