Ramco Cements కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం జగన్
అంతకు ముందు ఫ్యాక్టరీలోని పరికరాలు, టెక్నాలజీ, ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామ్‌కో ఇండస్ట్రీ వల్ల మన ప్రాంతానికి, మనకు మంచి జరుగుతుందన్నారు. మన పిల్లలు ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో లైమ్ స్టోన్ మైన్స్ ఉన్నప్పటికీ గతంలో ఎలాంటి పరిశ్రమలు లేవని.. ప్రస్తుతం ఇక్కడ 2 మిలియన్ టన్నుల క్లింకర్, 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటైందన్నారు. తద్వారా 3 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుందని, ఇది తొలి దశ మాత్రమేనని.. రాబోయే రోజుల్లో యాజమాన్యం దీన్ని విస్తరిస్తుందని అన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో మెరుగైన వసతులు వస్తాయని, సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ – సామాజిక బాధ్యత) వల్ల చుట్టుపక్కల గ్రామాలకు మంచి జరుగుతుందని తెలిపారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉండాలని చట్టం చేయడం వల్ల మన పిల్లలకు మంచే జరుగుతుందని వివరించారు.
పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళుతోందని, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అన్ని విధాలా అనుకూలమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి అంశంలో ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’గా అడుగులు వేస్తూ.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరిస్తోందన్నారు. ఈ మధ్య కాలంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: DRDO కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP