YSR Awards 2022 : విజయవాడలో ఘనంగా పురస్కారాల ప్రదానోత్సవం
సమాజంలో మానవత్వపు పరిమళాలు, ఎల్లలు దాటిన కీర్తి పతాకాలు పురస్కారాల పండుగలో పులకించాయి. నిలువెత్తు వ్యక్తిత్వం, మహోన్నత కీర్తి శిఖరం ‘వైఎస్సార్’పురస్కారాలతో సగౌరవంగా సత్కరించి ప్రభుత్వం తన వినమ్రత చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మానవతామూర్తులు, విశిష్ట వ్యక్తులను వరుసగా రెండో ఏడాది రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘‘వైఎస్సార్’’అవార్డులతో ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. వ్యక్తులుగా, సంస్థలుగా సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రతి ఒక్కరినీ గౌరవించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను నెలకొల్పింది.
Also read: Awards: రాష్ట్రానికి ‘కేంద్ర హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్’
వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ 1న విజయవాడలో నిర్వహించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు, దివంగత వైఎస్సార్ విగ్రహాలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2022 సంవత్సరానికిగానూ వ్యవసాయం, కళలు– సంస్కృతి, సాహిత్యం, మహిళా – శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమల రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు మొత్తం 30 అవార్డులను గవర్నర్, ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. వీటిల్లో 20 వైఎస్సార్ జీవిత సాఫల్య, 10 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలున్నాయి. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. వైఎస్సార్ అవార్డులను నెలకొల్పడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం, అవార్డు గ్రహీతల గొప్పతనాన్ని వివరించారు.
Also read: Booker Prize : శ్రీలంక రచయిత షెహాన్ కరుణతిలకకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్
మన కీర్తికి సత్కారం: సీఎం జగన్
దశాబ్దాలుగా మన సంస్కృతి, సంప్రదాయాలకు వారధులుగా నిలుస్తున్న వారిని ఈ అవార్డులతో సత్కరిస్తున్నాం. సమాజం కోసం శ్రమించిన మానవతామూర్తులు, మహనీయులను రాష్ట్ర అత్యున్నత అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. సామాన్యుల్లోని అసామాన్యులకు, మానవతామూర్తుల సేవలకు వందనంగా ‘వైఎస్సార్’అవార్డులు నిలుస్తాయి. తమ శ్రమ, స్వేదంతో రాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలను ఎక్కడా లేనివిధంగా ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్’అవార్డులతో ప్రభుత్వం సత్కరిస్తోంది. మహిళా రక్షణకు నిరంతరం పాటుపడే రక్షణ సారథులను, వెనుకబాటు, అణచివేత, పెత్తందారీ పోకడలపై ఎలుగెత్తిన సామాజిక ఉద్యమకారులను సవినయంగా గౌరవించుకుంటున్నాం. భిన్న కలాలు, గళాలు, పాత్రికేయులు, మన గడ్డపై పుట్టి వైద్య ఆరోగ్య రంగంలో ప్రపంచ కీర్తి గడించిన మహామహులు, అంతర్జాతీయంగా పేరొందిన మన పారిశ్రామిక దిగ్గజాలకు అవార్డులను అందజేస్తున్నాం.
Also read: వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP