Skip to main content

వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుద‌ల‌

వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌ మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌ మెంట్‌-2022’ అత్యున్నత పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు ప్రకటించారు.

వ్యవసాయం, కళలు, సాహిత్యం, విద్య, జర్నలిజం, వైద్యం, సామాజిక సేవ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన దాదాపు 25 మంది వ్యక్తులు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 1న  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  అవార్డులు ప్రదానం చేయనున్నారు.

కళలు–సంస్కృతి విభాగంలో వీరికే..:
కళాతపస్వి కె.విశ్వనాథ్‌, ఆర్‌.నారాయణమూర్తిలకు వైఎస్సార్‌ జీవిత కాల పురస్కారాలను ప్రకటించారు. సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ, కళంకారీ కళాకారుడు పిచుక శ్రీనివాస్‌, షేక్‌ గౌసియా బేగంలకు వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రకటించారు. 

సాహిత్య సేవ​‍- జీవిత కాల సాఫల్య పురస్కారాలు :
➤ విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌
➤ ఎమెస్కో ప్రచురణాలయం
➤ రచయిత డాక్టర్‌ శాంతి నారాయణ

వ్యవసాయం- వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు 
➤ ఆదివాసీ కేష్యూనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ​‍- సోడెం ముక్కయ్య
➤ కుశలవ కోకోనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ​‍-ఎ.గోపాలకృష్ణ
➤ అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌- జయబ్బనాయుడు
➤ అమృత ఫల ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ​‍-కె.ఎల్‌.ఎన్‌. మౌక్తిక
కట్టమంచి బాలకృష్ణారెడ్డి

మహిళా సాధికారత–రక్షణ విభాగం​‍- వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు
➤ ప్రజ్వలా ఫౌండేషన్‌– సునీతా కృష్ణన్‌
➤ శిరీషా రిహేబిలిటేషన్‌ సెంటర్‌
ఇక మూడో అవార్డును దిశ–పోలీసింగ్‌కు ప్రకటించారు. దిశ యాప్‌ ద్వారా 

వచ్చిన ఎస్‌వోఎస్‌ను అందుకున్న వెంటనే నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరకుని కాపాడిన అయిదుగురు పోలీసులకు.. ఈ ఏడాది వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును ఉమ్మడిగా ప్రకటించారు. రవాడ జయంతి, ఎస్‌వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజ్రతయ్య, పి.శ్రీనివాసులు వీరికి సంయుక్తంగా వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుకు ఎంపిక చేశారు.

Published date : 14 Oct 2022 07:47PM

Photo Stories