Awards: రాష్ట్రానికి ‘కేంద్ర హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్’
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నిఘా విభాగం అధిపతి అదనపు డీజీ అనిల్‌కుమార్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ బృందానికి ‘కేంద్ర హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్’లభించింది. 2022 సంవత్సరానికి గాను తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. దేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సరిహద్దుల పరిరక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధం, విపత్తు ల్లో సహాయక చర్యలు వంటి కార్యక్రమాల్లో పోలీసులు చేసిన ప్రత్యేక ఆపరేషన్‌లకు గుర్తింపుగా కేంద్రం ఏటా ఈ అవార్డులను అందిస్తోంది. కాగా 2022 సంవత్సరానికి గాను తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, జమ్మూకశీ్మర్‌లలో పోలీసు అధికారులు చేసిన నాలుగు స్పెషల్ ఆపరేషన్లకు, 2021కి సంబంధించి మహారాష్ట్రకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. తెలంగాణ నుంచి 13 మంది సభ్యుల బృందం చేసిన స్పెషల్ ఆపరేషన్‌ను ‘కేంద్ర హోం మంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్’కు ఎంపిక చేశారు. 2018లో ప్రారంభించిన ఈ పురస్కారాన్ని ఏటా సాధారణంగా 3 ప్రత్యేక ఆపరేషన్లకు ఇస్తున్నారు. అయితే అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రాల పోలీసులను ప్రోత్సహించేందుకు ఈ సారి 5 స్పెషల్ ఆపరేషన్లకు పురస్కారాన్ని ప్రకటించారు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 52వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఎవరు సత్కరించబడతారు?
అవార్డు లభించింది వీరికే..
తెలంగాణకు సంబంధించి అదనపు డీజీ అనిల్‌కుమార్‌తో పాటు డీఎస్పీ కైతా రవీందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ మొగుళ్ల వెంకటేశ్వర్‌గౌడ్, సబ్‌ఇన్‌స్పెక్టర్లు కుకుడపు శ్రీనివాసులు, మహ్మద్ అక్తర్ పాషా, పాండే జితేందర్ ప్రసాద్, సయ్యద్ అబ్దుల్ కరీం, హెడ్‌కానిస్టేబుల్ సనుగొమ్ముల రాజవర్ధన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు మహ్మద్ తాజ్ పాషా, మహ్మద్ ఫరీదుద్దీన్, బచ్చుల లక్ష్మీనారాయణ, కొడ్గల్ కిరణ్‌కుమార్, సయ్యద్ జియా ఉల్ హక్‌లతో కూడిన బృందానికి ఈ పురస్కారం లభించింది. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌కు సంబంధించి తెలంగాణ అధికారులకు ఈ పురస్కారం ప్రకటించినట్లు కేంద్రం అక్టోబర్ 31న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP