Skip to main content

Booker Prize : శ్రీలంక రచయిత షెహాన్‌ కరుణతిలకకు ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌

లండన్‌: శ్రీలంక రచయిత షెహాన్‌ కరుణతిలకను ప్రఖ్యాత బుకర్‌ ప్రైజ్‌ వరించింది. లండన్‌లో అక్టోబర్ 18న రాత్రి జరిగిన కార్యక్రమంలో 2022 ఏడాదికి ‘ ది సెవెన్‌ మూన్స్‌ ఆఫ్‌ మాలి అల్మీడియా’ రచనకు గాను కరుణతిలకకు బుకర్‌ సాహిత్య పురస్కారంతోపాటు 50వేల పౌండ్లను బహూకరించారు.
Prestigious Booker Prize for Sri Lankan author
Prestigious Booker Prize for Sri Lankan author

లండన్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటన్‌ రాజు చార్లెస్‌ సతీమణి కెమిల్లా ఈ ట్రోఫీని కరుణతిలకకు స్వయంగా అందజేశారు. 1992  తర్వాత ఒక శ్రీలంక జాతీయుడు ఈ బుకర్‌ ప్రైజ్‌ను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘ది సెవెన్‌ మూన్స్‌ ఆఫ్‌ మాలి ఆల్మీడియా’ కాల్పనిక థ్రిల్లర్‌ పుస్తకంలో..  శ్రీలంక అంతర్యుద్ధం తాలూకు ఘోరాలను, మానవీయ కోణాలను తన కెమెరాలతో బంధిస్తూ యుద్ధంలో మరణించిన ఒక ఫొటో జర్నలిస్ట్‌ కథను కరుణతిలక అద్భుతంగా ఆవిష్కరించారు. కథాగమనం గొప్పది’ అని బుకర్‌ ప్రైజ్‌ న్యాయనిర్ణేతల చైర్మన్‌ మ్యాక్‌గ్రిగార్‌ వ్యాఖ్యానించారు. పుస్తకంలో.. యుద్ధంలో మరణించిన మాలి అనే జర్నలిస్ట్‌ ఆ తర్వాత స్వర్గంలో కళ్లు తెరుస్తాడు. అతడిని చంపింది ఎవరు? ఎందుకు చంపారు ? వంటి మిస్టరీలను ఛేదించేందుకు అతనికి కేవలం ఏడు రోజుల సమయం మిగిలి ఉంటుంది. ఈ గడువు గడిచేలోపే కాలానికి ఎదురీదుతూ వాస్తవిక, కాల్పనిక ప్రపంచాల మధ్య తిరుగుతుంటాడు. శ్రీలంక అంతర్యుద్ధం తాలూకు ఘోరాలు, మానవీయ కోణాలు, ప్రజల కష్టాలు, తనవారి ప్రేమానురాగాలు, ఇలా ఎన్నో బంధాల తీవ్రతను మాలి ఆవిష్కరిస్తాడు. కరుణతిలక గతంలో అడ్వర్‌టైజింగ్‌ కాపీ రైటర్‌గా పనిచేశారు. కొన్ని పాటలు రాశారు. స్క్రీన్‌ప్లే అందించారు. ట్రావెల్‌స్టోరీలు రచించారు.   

Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 18th కరెంట్‌ అఫైర్స్‌

Published date : 19 Oct 2022 05:54PM

Photo Stories