Fraudulent Loan Apps: మోసకారి లోన్ యాప్‌లపై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్ సెంటర్: సీఏం జగన్
లోన్‌యాప్‌ల ఆగడాలపై ఉక్కుపాదం మోపాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజా ఆదేశాలతో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. జాతీయ నోడల్ ఏజెన్సీ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ)తో కలసి ఇటువంటి యాప్‌లపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది.
Also read: On online safety: 2 వేల లోన్ యాప్స్ తొలగింపు
ప్రత్యేక కాల్ సెంటర్..
జిల్లాలవారీగా ప్రత్యేక బృందాలు
లోన్‌యాప్‌ల మోసాలపై తక్షణం కేసులు నమోదు చేసి నేరాన్ని నిరూపించి న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించేందుకు పోలీసు శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రస్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న డయల్ 1930, సైబర్ మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100), సైబర్ క్రైమ్ పోర్టల్‌లను అనుసంధానిస్తూ ఈ కాల్ సెంటర్ సేవలు అందిస్తుంది. దీనికి వచ్చే ఫిర్యాదులను తక్షణమే సంబంధిత పోలీసు స్టేషన్లకు నివేదించి కేసుల దర్యాప్తును పర్యవేక్షిస్తుంది. దాంతోపాటు లోన్ యాప్ వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలవారీగా ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ బృందాలు వేధింపులకు పాల్పడే యాప్ కంపెనీలపై కేసుల నమోదు, బాధ్యుల అరెస్టు, విచారణ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి.
Also read: Andhra Pradesh: వృద్ధి రేటులో అగ్రస్థానంలో ఏపీ
సీఈఆర్టీతో కలసి కార్యాచరణ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గుర్తింపు ఉన్న నాన్ బ్యాంకింగ్ కంపెనీలే లోన్‌యాప్ ద్వారా వ్యవహారాలను నిర్వహించాలి. కానీ దేశంలో 75 శాతం లోన్ యాప్ కంపెనీలు ఆర్‌బీఐ గుర్తింపు లేనివే. ప్రధానంగా చైనా కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీలు మన దేశంలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నాయి. వీటిపై ఫిర్యాదు చేస్తే ఆర్‌బీఐ నిషేధం విధిస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేస్తుంది. అందుకోసం పోలీసు శాఖ కేంద్ర ఐటీ శాఖకు చెందిన సీఈఆర్టీ తో కలసి పనిచేయనుంది. ఈ కంపెనీలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట వేస్తారు. వాటికి సహకరిస్తున్న సంస్థలు, వ్యక్తులను గుర్తించి ఈడీకి నివేదిస్తారు. వీటిని నిషేధించడంతోపాటు ఐటీ, ఆర్థిక నేరాల నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేస్తారు.
Also read: Loans Writeoff : 5 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్లు రద్దు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP