Andhra Pradesh: వృద్ధి రేటులో అగ్రస్థానంలో ఏపీ
రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముగిసిన ఆర్ధిక సంవత్సరం (2021–22)లో రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ 2021–22లో స్థిర ధరల ప్రకారం 11.43 శాతం వృద్ధి రేటు సాధించినట్లు తెలిపింది. తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకన్నా ఏపీ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. కోవిడ్–19 సంక్షోభం, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, దేశంలో 2020–21 సంవత్సరంలో వృద్ధి రేటు తిరోగమనంలో ఉన్న విషయం తెలిసిందే. కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడి, గత ఏడాదిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 2021–22లో ఏపీ ఏకంగా 11.43 శాతం రెండంకెల వృద్ధి సాధించింది.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ICC క్రికెట్ కమిటీకి ఏ భారత మాజీ క్రికెటర్‌ని నియమించారు?
ఇదే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వృద్ధి రేటు కేవలం 8.7 శాతమే. ఏపీ తరువాత అత్యధిక వృద్ధి రాజస్థాన్ 11.04 శాతం సాధించింది. ఆ తరువాత బీహార్ 10.98 శాతం, తెలంగాణ 10.88 శాతం వృద్ధి సాధించాయి.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: వివా ఎంగేజ్ యాప్‌ను ప్రారంభించిన కంపెనీ ఏది?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP