On online safety: 2 వేల లోన్ యాప్స్ తొలగింపు
సైబర్‌సెక్యూరిటీపై రోడ్‌షోలు..
ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించే దిశగా భారత్‌లో వివిధ నగరాల్లో సైబర్‌సెక్యూరిటీ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 1,00,000 మంది డెవలపర్లకు శిక్షణ కల్పించనున్నట్లు, అలాగే డిజిటల్ భద్రతను ప్రోత్సహించే దిశగా వివిధ సంస్థలకు గూగుల్‌డాట్‌ఆర్గ్ 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) నిధులు గ్రాంట్‌గా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టివ్ గుడ్ ఫౌండేషన్, పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్ప్‌ఏజ్ ఇండియా తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. సైబర్ ముప్పుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గుప్తా వివరించారు. డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించే క్రమంలో మెరుగైన విధానాలు పాటించేలా ఇంటర్నెట్ యూజర్లను ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాన్ని కూడా వివిధ భాషల్లో గూగుల్ ఆవిష్కరించింది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP