Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 27th కరెంట్ అఫైర్స్
Telangana Mountaineer: 6,012 మీటర్ల ఎత్తు కలిగిన శిఖరాన్ని అధిరోహించిన కావ్య మన్నెపు, పూర్ణ మాలావత్
హిమాలయ పర్వత శ్రేణుల్లో 6,012 మీటర్ల ఎత్తు కలిగిన శిఖరాన్ని అధిరోహించిన అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మన్నెపు, ప్రముఖ పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. తెలంగాణకు చెందిన ఇద్దరు మహిళలు అత్యంత ధైర్యసాహసాలతో ఇప్పటి వరకు ఎవరూ అధిరోహించని శిఖరాన్ని చేరుకోవడం హర్షణీయమన్నారు.
Also read: Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ ఝున్ వాలా హఠాన్మరణం
World cadet judo championships 2022: ప్రపంచ చాంపియన్ లింథోయ్
బోస్నియా అండ్ హెర్జెగోవినాలోని సరజెవోలో జరిగిన ప్రపంచ జూడో చాంపియన్‌షిలో భారత అమ్మాయి లింథోయ్ చనంబమ్ సంచలనం సృష్టించింది. క్యాడెట్ విభాగంలో (57 కేజీల కేటగిరీ) ఆమె విజేతగా నిలిచింది. మణిపూర్‌కు చెందిన 15 ఏళ్ల లింథోయ్ ఆగష్టు 26 న జరిగిన ఫైనల్లో 1–0 తేడాతో రీస్ బియాంకా (బ్రెజిల్)ను ఓడించింది. 8 నిమిషాల 38 సెకన్ల పాటు సాగిన బౌట్‌లో భారత జుడోకా సత్తా చాటింది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత జూడోకా ఒకరు ప్రపంచ చాంపియన్ కావడం ఇదే తొలిసారి. పురుషులు లేదా మహిళల విభాగాల్లో సీనియర్, జూనియర్, క్యాడెట్... ఇలా ఏ విభాగంలోనూ ఇప్పటి వరకు భారత్‌నుంచి ఎవరూ విజేతగా నిలవలేదు. గత జూలైలో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కేడెట్ జూడో చాంపియన్‌షిప్‌లో లింథోయ్ కూడా స్వర్ణం సాధించింది.
Also read: IMFలో ఈడీగా సుబ్రమణియన్ నియామకం
Wally Adeyemo: రష్యా ఆయిల్‌పై నియంత్రణకు మా కూటమిలో చేరండి
రష్యన్ ముడిచమురు రేటును నియంత్రించడం ద్వారా ఆ దేశ ఆదాయ మార్గాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న కూటమిలో చేరాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి మరింత పెంచుతోంది. భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి వాలీ అడెయెమో.. ప్రభుత్వ వర్గాలతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలతో పాటు ఈ అంశంపైనా చర్చించారు. రష్యా చమురు రేట్లకు చెక్ పెట్టడమనేది, దేశీయంగా ఇంధన ధరలను తగ్గించుకోవాలన్న భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని వాలీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు తత్సంబంధ వివరాలు అందిస్తున్నామని, దీనిపై చర్చలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా దిగ్బంధం చేసేందుకు .. అమెరికా తదితర దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రష్యాకు కీలక ఆదాయ వనరైన చమురు రేట్లను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ఎగిసినప్పటికీ భారత్‌కు రష్యా డిస్కౌంటు రేటుకే చమురును అందిస్తోంది. దీంతో రష్యా నుంచి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు అమెరికా యత్నిస్తోంది.
also read: Wally Adeyemo: రష్యాపై ఆంక్షలను భారత కంపెనీలు ఉల్లంఘించలేదు
Merger of subsidiaries: అనుబంధ సంస్థల విలీనం పూర్తి: NTPC
పూర్తి అనుబంధ సంస్థలు నంబినగర్ పవర్ జనరేటింగ్ కంపెనీ, కాంటి బిజిలీ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్‌లను విలీనం చేసుకున్నట్లు ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్‌టీపీసీ తాజాగా పేర్కొంది. 2018లో ఈ రెండు కంపెనీలూ సొంత అనుబంధ సంస్థలుగా మారినట్లు తెలియజేసింది. ఈ రెండు సంస్థలలోనూ బీహార్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీకిగల ఈక్విటీ వాటాలను ఎన్‌టీపీసీ చేజిక్కించుకుంది. కాగా.. రెండు సంస్థల విలీనం పూర్తయినట్లు ఎన్‌టీపీసీ తాజాగా వెల్లడించింది. భాగస్వామ్య సంస్థ నంబినగర్ పవర్‌లో 50 శాతం వాటా కలిగిన ఎన్‌టీపీసీ మరో 50 శాతం వాటాను దక్కించుకుంది. ఇదే విధంగా కాంటి బిజిలీ ఉత్పాదన్‌లోనూ 27.36 శాతం వాటాను కొనుగోలు చేసింది. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో నంబినగర్ పవర్ 1,980 మెగావాట్ల బొగ్గు ఆధారిత సూపర్ విద్యుదుత్పత్తి ప్లాంటును నిర్వహిస్తోంది. కాంటి బిజిలీ ఉత్పాదన్ సైతం ముజఫర్‌పూర్(బీహార్)లో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటును కలిగి ఉంది.
Also read: RBI Statistics : పటిష్ట బాటన భారత్ ఎకానమీ..!
Logistic law: అన్ని రకాల రవాణాకు ఒకే లాజిస్టిక్ చట్టం: గడ్కరీ
సరుకు రవాణాకు సంబంధించి అన్ని మాధ్యమాలకు కలిపి ఒకే లాజిస్టిక్ చట్టాన్ని తేవడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తద్వారా పాటించాల్సిన నిబంధనలను మరింత సరళతరం చేయనుందని చెప్పారు. దేశీయంగా ఎయిర్ కార్గో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య విధానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశీ ఎయిర్ కార్గో ఏజెంట్స్ అసోసియేషన్ 12వ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో లాజిస్టిక్స్ వ్యయాల వాటా 14 శాతంగా ఉంటోందని, దీన్ని 8 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ పేర్కొన్నారు. దేశీ ఏవియేషన్ మార్కెట్లో ఎయిర్ కార్గో వాటా చాలా స్వల్ప స్థాయిలో ఉందని, అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. చేపలు, పండ్లు వంటి ఉత్పత్తుల రవాణాకు పాతబడిన డిఫెన్స్ విమానాలను ఉపయోగించవచ్చని గడ్కరీ సూచించారు. మన దగ్గర గణనీయ స్థాయిలో ఉన్న విమానాల వినియోగాన్ని తగు చర్యల ద్వారా మరింత మెరుగుపర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. గగన మార్గంలో మరింత ఎక్కువగా రవాణా చేయగలిగితే లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గగలవని తెలిపారు.
Also read: Nitin Gadkari: 8 సీటర్ వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి
FM Nirmala Sitharaman: రెండేళ్ల పాటు 7.4 శాతం వృద్ధి
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం మేర వృద్ధిని చూస్తుందని, తదుపరి ఆర్థిక సంవత్సరంలోనూ (2023–24) ఇదే వృద్ధి రేటు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ముంబైలో ఆగష్టు 26 న ఎఫ్‌ఈ బెస్ట్ బ్యాంక్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. వెలుపలి వైపు సవాళ్లు ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాల్సిన తరుణం కాదన్నారు. ఆర్థిక కార్యకలాపాల ఆధారంగా చూస్తే తమ సొంత అంచనాలు సైతం 7.4 శాతం వృద్ధిని సూచిస్తున్నట్టు చెప్పారు.
Also read: State Finances : 2021 -22 Budget Analysis : అప్పుల్లో తమిళనాడు టాప్
Artificial Intelligence : గుంతల రోడ్లకు తేజస్సు!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)కు అవసరమైన ఆవిష్కరణలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ క్యాప్ జెమినితో కలిసి తెలంగాణ ఇన్నోవేషన్ మిషన్(టీ ఎయిమ్) ‘మొబిలిటీ ఏఐ గ్రాండ్ చాలెంజ్’ను ఆగష్టు 26 న ప్రారంభించింది. కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రత్యక్ష, ఫైల్ వీడియోల ఆధారంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎంపిక చేసిన మార్గాల్లో రోడ్లపైనున్న గుంతలను గుర్తించి తీవ్రతను బట్టి వాటిని వర్గీకరించేలా పరిష్కారాన్ని ఈ చాలెంజ్‌లో ఆవిష్కరించాల్సి ఉంటుంది.
Also read: Vande Bharat Trains: అధునాతన సాంకేతికతతో వందేభారత్ రైళ్లు
Plastic free AP: రాష్ట్రంలో క్లాత్ బ్యానర్లు మాత్రమే వాడాలి: సీఎం వైఎస్ జగన్
రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అందరూ క్లాత్ బ్యానర్లు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ దిశగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి అవగాహన పెంపొందించాలని అధికార యంత్రాగానికి సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్ సైక్లింగ్‌తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) సందర్భంగా ఆగష్టు 26 న విశాఖలో సీఎం జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు.
Also read: ISRO : సూర్యుడిపై ఇస్రో కన్ను.. ‘ఆదిత్య ఎల్1’ ప్రయోగం కోసం..
ప్రపంచంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఒప్పందం చేసుకున్నామని, తద్వారా విశాఖలో పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కానుందని తెలిపారు. మూడు దశల్లో రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో (2 బిలియన్ డాలర్లు) 20 వేల మందికి ఉపాధి కల్పించేలా పార్లే సూపర్ హబ్, రీ సైక్లింగ్, అప్‌సైక్లింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని చెప్పారు.
Also read: NASA: కృష్ణబిలం ‘వినిపిస్తోంది’
పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ‘క్లాప్’ (క్లీన్ ఏపీ – జగనన్న స్వచ్ఛ సంకల్పం) కార్యక్రమాన్ని గతేడాది అక్టోబరు 2న ప్రారంభించింది. 4,097 చెత్త సేకరణ వాహనాలను అందచేసింది.
Also read: Most Distant Star ఎరెండల్
‘‘దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం 975 కి.మీ. పొడవు కలిగి ఉన్న మన రాష్ట్రంలో విశాలమైన ఇసుక బీచ్‌లు, వన్య మృగాలు, పక్షుల కేంద్రాలున్నాయి. రాష్ట్ర పౌరులుగా తీర ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం మనందరి విధి. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని సముద్రాలు మన లక్ష్యం కావాలి’’
– సీఎం జగన్
Also read: Supernova : గుర్తించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
Visakhapatnam: అస్త్ర పరీక్షల కేంద్రంగా విశాఖ
ప్రధానంగా సముద్రంలో జరిగే యుద్ధాల్లో వినియోగించే ఆయుధాల పరీక్షా కేంద్రాన్ని రక్షణ శాఖ నెలకొల్పుతోంది. ఇలాంటి కేంద్రం దేశంలో విశాఖలోనే ఏర్పాటు కానుండటం గమనార్హం. అలాగే క్షిపణులు, రాకెట్ల పరీక్షా కేంద్రం కూడా ఇక్కడ నిర్మితమవుతోంది. భారీ టార్పెడోల పరీక్షలకూ ఈ కేంద్రాన్ని వినియోగించుకునే వీలుంది. తీర ప్రాంత రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఈఎన్‌సీ (ఈస్ట్రన్ నేవల్ కమాండ్) స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది.
Also read: Vande Bharat Trains: అధునాతన సాంకేతికతతో వందేభారత్ రైళ్లు
భీమిలిలో క్షిపణులు, రాకెట్ల పరీక్ష కేంద్రం
ఇప్పటికే యుద్ధ నౌకలు, సబ్ మెరైన్ల స్థావరంగా ఉన్న విశాఖ తీరం తాజాగా మరో రెండు ముఖ్యమైన రక్షణ వ్యవస్థలకు కేంద్రంగా మారుతోంది. దేశంలోనే తొలిసారిగా భారీ టార్పెడోలు, అండర్ వాటర్ వెపన్స్ పరీక్ష కేంద్రాన్ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) నిరి్మంచనుంది. భీమిలిలో అన్ని రకాల క్షిపణులు, రాకెట్లను పరీక్షించే కేంద్రం ఏర్పాటుకు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా ఇటీవల శంకుస్థాపన చేశారు.
Also read: NASA:మన సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహం..
రెండు టన్నుల భారీ టార్పెడోలను సైతం...
గత జూలైలో గుజరాత్ తీరంలోని భారత సముద్ర జలాల పరిధిలోకి పాకిస్థాన్‌కు చెందిన యుద్ధనౌక (పీఎన్‌ఎస్ అలంగీర్) చొచ్చుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. మన నౌకాదళాలు వెంటనే గుర్తించడంతో పాకిస్థాన్ పాచికలు పారలేదు. మహారాష్ట్ర తీర ప్రాంతంలో కూడా ఓ విదేశీ చిన్న పడవ ఆయుధాలతో వచ్చింది. అయితే అది ఆస్ట్రేలియన్ దంపతులదని తేలింది. తీర రక్షణ ఎంత కీలకమన్న విషయాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు నౌకాదళ కేంద్రంగా ఉన్న విశాఖ తీరంలో ఎన్విరాన్‌మెంటల్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు బాధ్యతను ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా బీడీఎల్‌కు అప్పగించారు. ఇప్పటికే టార్పెడోలు, అండర్ వాటర్ వెపన్స్ తయారీ యూనిట్‌ను భారత్ డైనమిక్స్ విశాఖలోనే ఏర్పాటు చేసింది. అయితే వాటిని పరీక్షించే కేంద్రం లేకపోవడంతో దాన్ని కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలని నౌకాదళం నిర్ణయించింది. దీనిలో భాగంగా 8 మీటర్ల పొడవు, 2 టన్నుల బరువైన భారీ టార్పెడోల్ని సైతం ఈ టెస్టింగ్ సెంటర్‌లో పరీక్షించేలా అత్యాధునిక వైబ్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. థర్మల్ చాంబర్, వాకింగ్ చాంబర్లను ఏర్పాటు చేసి అండర్ వాటర్ వెపన్స్‌నూ అణువణువూ పరీక్షించేలా యూనిట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు.
Also read: Indian Navy: భారతదేశ స్వదేశీ విమాన వాహక నౌక IAC `విక్రాంత్` సెప్టెంబరు 2న నౌకాదళంలోకి ప్రవేశించనుంది
విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం
వైబ్రేషన్ టెస్ట్‌లతో పాటు పర్యావరణహిత పరీక్షలు కూడా ఇందులో నిర్వహించేలా ఏర్పాటవుతున్న ఈ పరీక్ష కేంద్రం నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో అండర్‌వాటర్ వెపన్స్, టార్పెడోల్ని మిత్ర దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం లభిస్తుంది. క్రమంగా టార్పెడోలతో పాటు ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే క్షిపణులు, యుద్ధ విమానాలతో పాటు గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఆయుధాలు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్‌నూ ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంటుందని ఈ సందర్భంగా నౌకాదళాధికారులు భావిస్తున్నారు.
Also read: E-bandage: గాయాలను మాన్పే ఈ–బ్యాండేజ్‌ల అభివృద్ధి
ఏర్పాటైన సంవత్సరం – 1968 మార్చి 1
కమాండింగ్ ఇన్ చీఫ్ – త్రీ స్టార్ ఫ్లాగ్ ఆఫీసర్ (వైస్ అడ్మిరల్ ర్యాంక్)
ప్రస్తుత వైస్ అడ్మిరల్ – బిస్వజిత్ దాస్‌గుప్తా
బలం – 58 యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు
ఫ్లాగ్ షిప్ – ఐఎన్‌ఎస్ జలశ్వ
ఈఎన్‌సీ పరిధిలో నేవల్ బేస్‌లు – 15
విశాఖలో నేవల్ బేస్‌లు – 8
కొత్తగా నిరి్మస్తున్న నేవల్ బేస్‌లు – విశాఖలో–1, ఒడిశాలో 2
తూర్పు నౌకాదళం సిబ్బంది, అధికారులు – సుమారు 40,500 మంది
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP