Skip to main content

Wally Adeyemo: రష్యాపై ఆంక్షలను భారత కంపెనీలు ఉల్లంఘించలేదు

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు వ్యతిరేకంగా రష్యాపై విధించిన ఆంక్షలను భారత కంపెనీలు ఏవీ ఉల్లంఘించిన ధాఖలాలు లేవని అమెరికా ట్రెజరీ డిప్యూటీ సెక్రటరీ వాలే అదేమో స్పష్టం చేశారు.
Us Deputy Secretary Of Treasury Wally Adeyemo
Us Deputy Secretary Of Treasury Wally Adeyemo

భారత్‌తోపాటు అమెరికా, యూరోప్‌ సహా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఆంక్షలను సీరియస్‌గా తీసుకుని అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆంక్షలకు విరుద్ధంగా భారత్‌ రష్యా చమురును దిగుమతి చేసుకుని, శుద్ధి తర్వాత ఎగుమతి చేస్తోందని అమెరికా ఆందోళన చెందుతున్నట్టు RBI డిప్యూటీ గవర్నర్‌ మైకేల్‌ పాత్ర ఇటీవలే పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన అదేమో భారత్‌కు మద్దతుగా ఆగష్టు 24 న మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా, ఉక్రెయిన్‌తోపాటు ద్వైపాక్షిక అంశాలపై భారత అధికారులతో చర్చించనున్నట్టు చెప్పారు. ‘‘అమెరికా ఆధ్వర్యంలో రష్యాపై విధించిన ఆంక్షలు విస్తృతమైనవి. వీటి అంతిమ లక్ష్యం చమురు ఎగుమతుల ద్వారా రష్యాకు వచ్చే ఆదాయాన్ని తగ్గించడమే. అదే సమయంలో ఇంధన సరఫరా సజావుగా ఉండేలా చూడడం’’అని చెప్పారు. భారత కస్టమర్లు ఇంధనం కోసం ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. 

Also read: Weekly Current Affairs (International) Bitbank: 2022 ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 26 Aug 2022 05:56PM

Photo Stories