Nitin Gadkari: 8 సీటర్ వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి
దేశవ్యాప్తంగా ఏటా అయిదు లక్షల రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేలా ఎనిమిది సీట్ల మోటారు వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండేలా నిబంధనలను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇంటెల్ ఇండియా సేఫ్టీ పయోనీర్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. దీని కోసం ఆటోమొబైల్ రంగం సహా సంబంధిత వర్గాల అన్నింటి సహకారం కూడా కావాలని ఆయన పేర్కొన్నారు. కఠినతరమైన భద్రత, కాలుష్య ప్రమాణాల కారణంగా వాహనాల ఖరీదు పెరిగిపోతోందంటూ ఆటోమొబైల్ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also read: GK Economy Quiz: US డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట రికార్డు ఎంత?