T20 World Highlights 2022 : న్యూజిలాండ్ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్.. 13 ఏళ్ల తర్వాత..
తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక కివీస్‌పై విజయంతో పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో మెగా టోర్నీ తుది పోరుకు అర్హత సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆరంభంలోనే ఓపెనర్ ఫిన్ అలెన్ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో డెవాన్ కాన్వే, కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు.
T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్-2022 విజేత, రన్నరప్ టీమ్‌లకు ప్రైజ్‌మనీ ఎంతంటే..?
నిర్ణీత 20 ఓవర్లలో..
అయితే, దురదృష్టవశాత్తూ కాన్వేను షాదాబ్ ఖాన్ రనౌట్ చేయడంతో రెండో వికెట్ పడింది. విలియమ్సన్ 46 పరుగులు చేసిన షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వెనుదిరిగాడు. గ్లెన్ ఫిలిప్స్ 6 పరుగులు మాత్రమే చేయగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కివీస్ 152 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం అదిరిపోయే ఆరంభం అందించారు. బాబర్ ఆజం 42 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఇక రిజ్వాన్ 57 పరుగులతో అదరగొట్టాడు. మహ్మద్ హారీస్ 30 పరుగులతో రాణించాడు. అయితే మ్యాచ్‌ను ఆఖరి ఓవర్ వరకు లాక్కొచ్చిన కివీస్ బౌలర్లు ఒత్తిడిలో చిత్తయ్యారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది. మహ్మద్ రిజ్వాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
మ్యాచ్ స్కోర్ వివరాలు ఇలా..:
న్యూజిలాండ్: 152/4 (20)
పాకిస్తాన్: 153/3 (19.1)
Virat Kohli Top Records : కోహ్లి కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఇవే.. ఎందుకంటే..?
అనూహ్యంగా..
టి20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్ నక్కతోక తొక్కింది. ఒక దశలో సూపర్-12లోనే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిన దశలో అనూహ్యంగా ఫుంజుకున్న పాకిస్తాన్ సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఆపై దురదృష్టానికి కేరాఫ్ అయిన ప్రొటిస్ జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓడి పాక్ సెమీస్ వెళ్లేందుకు బాటలు పరిచింది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్‌పై సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది.
T20 World Cup New Rules : టి-20 వరల్ట్ కప్‌లో అమలు కానున్న కొత్త రూల్స్ ఇవే.. ఫస్ట్ టైమ్..
13 ఏళ్ల తర్వాత..
గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కే పరిమితమైన పాకిస్తాన్ ఈసారి మాత్రం వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టలేదు. మొదట బౌలింగ్.. ఆపై బ్యాటింగ్‌లో సమిష్టి ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. 2009 తర్వాత టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టడం మళ్లీ ఇదే. అలా 13 ఏళ్ల తర్వాత మరోసారి కప్ కొట్టడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడితే..
ఇక 2007లో ఫైనల్ చేరినప్పటికి టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. 2009లో మాత్రం ఫైనల్లో లంకను చిత్తుచేసి విశ్వవిజేతగా నిలిచింది. అయితే దాయాది పాకిస్తాన్ ఫైనల్‌కు చేరడంతో.. ఇప్పుడందరి కళ్లు టీమిండియాపై పడ్డాయి. గురువారం(నవంబర్ 10న) ఇంగ్లండ్‌తో జరగనున్న సెమీఫైనల్లో టీమిండియా గెలవాలని.. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడితే చూడాలని అభిమానులు దేవుడికి ప్రార్థిస్తున్నారు. వారి కోరిక నెరవేరుతుందేమో చూడాలి.
ICC : రానున్న ఐదేళ్లలో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..