Bank Holidays in May 2023: మేలో 12 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే
Sakshi Education
మే నెల బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. శని, ఆదివారాలతో సహా పండుగలు, ఇతర సందర్భాల కారణంగా మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ బ్యాంకు సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి.
Bank-Holidays-in May
సెలవుల జాబితా....
మే 1న మహారాష్ట్ర డే/ మేడే కారణంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, త్రివేండ్రంలలో బ్యాంకులకు సెలవు.
మే 22న మహారాణా ప్రతాప్ జయంతి నేపథ్యంలో సిమ్లాలో బ్యాంకుల బంద్.
మే 24న కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా త్రిపురలో సెలవు.
మే 27న నాల్గవ శనివారం సాధారణ సెలవు.
మే 28న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
సెలవు రోజుల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు
సెలవు దినాల్లో, బ్యాంకులు మూతపడినప్పుడు మొబైల్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. డబ్బును బదిలీ చేయడానికి UPIని ఉపయోగించవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలను ఉపయోగించవచ్చు.