Skip to main content

TSPSC Group-4 Application Edit Option 2023 : గ్రూప్‌-4 ద‌రఖాస్తు ఎడిట్ అవ‌కాశం.. ఈ అవ‌కాశం కేవలం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 8,180 గ్రూప్‌–4 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఉద్యోగాల‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దరఖాస్తులో దొర్లిన తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని టీఎస్‌పీఎస్సీ కల్పిస్తుంది.
tspsc jobs application edit option 2023 news telugu
tspsc jobs application edit option 2023 details

మే 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎడిట్ చేసే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ అధికార వెబ్‌సైట్ https://websitenew.tspsc.gov.in/ నుంచి మీ ద‌రఖాస్తును ఎడిట్ చేసుకోవ‌చ్చును. ఈ అవ‌కాశం కేవలం ఒక అభ్యర్థికి ఒకసారి మాత్రమే ఉంటుంది.

TSPSC Group 4 Best Books in Telugu : గ్రూప్‌-4కి ఈ బుక్స్ చ‌దివితే.. ఉద్యోగం మీదే..
 
రాతపరీక్ష భాషను కూడా..

tspsc group4 jobs

గ్రూప్ – 4 రాత పరీక్షను తెలుగు/ ఇంగ్లీష్ మరియు ఇంగీ/ ఉర్దూ భాషలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఎడిట్ ఆప్షన్ లో అభ్యర్థులు రాత పరీక్ష భాషను ఎంచుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్, ఆడిటర్ మొద‌లైన‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఈ కొలువులకు పోటీ తీవ్రంగానే ఉంది. అలాగే ఈ ఉద్యోగాల‌కు 9,51,321 దరఖాస్తులు వ‌చ్చాయి.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

జులై 1న గ్రూప్ 4 పరీక్షను రెండు పేపర్లగా నిర్వహించనున్నారు. టీఎస్‌పీఎస్సీ ఉదయం 10 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వరకు పేపర్ 1 ను నిర్వ‌హించ‌నున్నారు. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష నిర్వహించనున్నారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పోస్టులు ఇవే..

tspsc group 4 jobs list

☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ I&CADలో జూనియర్ స్టెనో
☛ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్‌లో టైపిస్ట్
☛ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్‌లో జూనియర్ స్టెనో
☛ రెవెన్యూ శాఖలో జూనియర్ స్టెనో
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ స్టెనో
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో టైపిస్ట్
☛ I&CADలో జూనియర్ అసిస్టెంట్
☛రెవెన్యూ శాఖలో టైపిస్టు
☛ రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్
☛ పంచాయతీ రాజ్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ పంచాయతీ రాజ్‌లో టైపిస్ట్
☛ గ్రామ రెవెన్యూ అధికారి (VRO)
☛గ్రామ రెవెన్యూ సహాయకుడు (VRA)
☛ తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో జేఏ
☛ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ అటవీ శాఖలో జూనియర్ అసిస్టెంట్.

TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చ‌దివితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు..

గ్రూప్‌-4 ప‌రీక్షావిధానం ఇదే..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4ను రెండు పేపర్లుగా.. 300 మార్కులకు పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.. జోనల్, డిస్ట్రిక్ట్, కేటగిరీ వారీ మెరిట్‌ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.  ఇందులో పేపర్‌ 1 జనరల్‌ నాలెడ్జ్‌ 150 మార్కులకు, అలాగే పేపర్‌ 2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు.

☛ TSPSC Group 4 Paper-2 Success Tips in Telugu : గ్రూప్‌-4 పేప‌ర్‌-2లో 150కి 130 మార్కులు సాధించ‌డం ఎలా..?

గ్రూప్‌-4 స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ మొత్తం మార్కులు: 300

పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు సమయం (ని.) మార్కులు
1 జనరల్‌ స్టడీస్‌ 150 150 150
2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ 150 150 150

పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 06 May 2023 07:53PM
PDF

Photo Stories