TSPSC Group 4 Paper-2 Success Tips in Telugu : గ్రూప్-4 పేపర్-2లో 150కి 130 మార్కులు సాధించడం ఎలా..?
తెలంగాణ ప్రభుత్వం 8,180 గ్రూప్–4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. అయితే టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఈ కొలువులకు పోటీ తీవ్రంగానే ఉంది. అలాగే ఈ ఉద్యోగాలకు 9,51,321 దరఖాస్తులు వచ్చాయి. జులై 1న గ్రూప్ 4 పరీక్షను రెండు పేపర్లగా నిర్వహించనున్నారు. అయితే అభ్యర్థులు ఎప్పుడు పోటీని పట్టించుకోకుండా.. మీరు చదవాల్సిన ముఖ్యమైన అంశాలను ఒక ప్రణాళిక ప్రకారం చదివే.. మీరు ఉద్యోగాన్ని ఈజీగా కొట్టవచ్చు అని.., ఈ చిన్న మెలకువలు పాటిస్తే విజయం సాధించవచ్చు అంటున్నారు ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు బి. రవిపాల్‌రెడ్డి డెరైక్టర్, సిగ్మా, హైదరాబాద్.
గ్రూప్–4 పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఇందులో పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్–150, పేపర్–2లో సెక్రటేరియల్ ఎబిలిటీస్ 150 మార్కులకు ఉంటుంది. పీవో, క్లరికల్ వంటి బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతోపాటు, మ్యాథ్స్ నేపథ్యం ఉన్న వారు కొద్దిగా కష్టపడితే పేపర్–2లో మంచి స్కోర్ చేయొచ్చు. అలాగే పేపర్-2లో ఈజీగానే 150కి 120 పైగా మార్కులు చేయోచ్చు అంటున్నారు సబ్జెక్ట్ నిపుణులు రవిపాల్‌రెడ్డి గారు..