Inspirational Story: కళ్లులేవని వెక్కిరించారు... లెక్కచేయక లక్ష్యాన్ని చేరుకుని ఆదర్శంగా నిలుస్తున్నారిలా...
ఏ కాలేజీలో అయితే చదువుకునేందుకు అర్హత లేదని వెక్కిరించారో... ఇప్పుడు అదే కళాశాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వెళుతోంది ఓ యువతి.. మరో యువతి జాతీయంగా, అంతర్జాతీయంగా తన సంగీతంతో ఉర్రూతలూగిస్తోంది. ఈ ఇద్దరి యువతుల విజయగాథ మీకోసం...
Success Story: ఆ ఘటనతో బ్యాంకు జాబ్ వదిలేశా... మూడేళ్లపాటు వ్యవసాయంలో మెళకువలు నేర్చుకున్నా.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నానిలా
సిమ్లా జిల్లాకు చెందిన అంబికా దేవీ, జయ్‌చంద్ దంపతుల కుమార్తె అయిన ముస్కాన్ పుట్టుకతోనే అంధురాలు. కులూలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె.. పోర్ట్‌మోర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో సీనియర్ సెకండరీ విద్యను పూర్తి చేశారు. 2013లో రాజ్‌కియా కన్యా మహావిద్యాలయ వర్సిటీలో ప్రవేశం పొందిన ఐదుగురు అంధ బాలికల్లో ముస్కాన్ ఒకరు. సంగీతంలోనూ ప్రవేశం ఉన్న ముస్కాన్.. ప్రస్తుతం మ్యూజిక్‌లో డాక్టరేట్ చేస్తున్నారు. ఆర్‌కేఎంవీ వర్సిటీలో మ్యూజిక్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.
నాడు కోచింగ్ వెళ్లేంత స్థోమత లేదు.. నేడు దేశం మొత్తం గర్వించే.. ‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకున్నారిలా..
ప్రతిభా ఠాకుర్ గతంలో ఓ విద్యా సంస్థలో ప్రవేశానికి నిరాకరణకు గురయ్యారు. తాజాగా అదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రతిభా ఠాకూర్ స్వగ్రామం మండీ జిల్లాలోని మతక్. ఇటీవలే రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలో పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.