Skip to main content

Job Layoffs : ఉద్యోగాల కోత మొద‌లైంది.. ఈ ప్ర‌ముఖ సంస్థ‌లో కూడా భారీగా..

ఆర్ధిక మాంద్యం వచ్చిన తర్వాత జాగ్రత‍్త పడే కంటే.. వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి అందుకు అనుగుణంగా సన్నంద్ధం అవ్వడం మంచిదని భావిస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే ఆందోళనతో స్టార్టప్‌ల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు ఈ పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి.
jobs layoffs
job layoffs 2022

ఈ తరుణంలో ప‍్రముఖ టెలికం పరికరాల తయారీ సంస్థ సిస్కో భారీ ఎత్తున ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనున్నట్లు తెలుస్తోంది.మెటా, నెటఫ‍్లిక్స్‌,స్నాప్‌ చాట్‌, అమెజాన్‌ బాటలో సిస్కో ఉద్యోగుల తొలగింపుల్ని ముమ్మరం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థలో 83 వేలమంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో 4,100 మంది సిబ్బందిపై వేటు వేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

Jobs Layoffs 2022 : అస‌లు ఎందుకు ఇంత భారీగా ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌.. ఇంకా రానున్న రోజుల్లో ఇది..

ఖర్చు తగ్గించుకోవడం కోసమే..
ఈ వారంలో సిస్కో తన మొదటి త్రైమాసిక ఫలితాల్ని విడుదల చేసింది. 13.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అర్జించినట్లు చెప్పిన సిస్కో.. ఈ ఏడాది ఆదాయం 6 శాతం పెరిగినట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సిస్కో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్కాట్ హెర్రెన్ ఉద్యోగులపై వేటు పున: నిర్మాణం (రీ బ్యాలెన్స్‌)గా అభివర్ణించారు. ఖర్చు తగ్గించుకోవడం కోసమే చూస్తున్నాం. ఉద్యోగుల తొలగింపు మాత్రం అనుకోవద్దు’ అని అన్నారు. కాగా, ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కేలా మెటా, ట్విటర్‌, సేల్స్‌ ఫోర్స్‌, మైక్రోసాఫ్ట్‌, స్ట్రైప్‌లు ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ ఇవ్వగా.. ఆ సంస్థల జాబితాలో సిస్కో చేరింది.

Jobs : ఇంటెల్ చరిత్రలోనే తొలిసారిగా.. భారీగా ఉద్యోగులను తొల‌గింపు.. ఎందుకంట‌..?!

జొమాటోలో కూడా.. భారీగానే..

zomato

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వారాల వ్యవధిలో ముగ్గురు ఉన్నత స్థాయి ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేశారు. ఈ తరుణంలో జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం వర్క్‌ ఫోర్స్‌లో 4 శాతం మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నష్టాల్లో ఉన్న సంస్థలో  ఖర్చును తగ్గించి లాభసాటిగా మార్చేందుకు దేశ వ్యాప్తంగా ప్రొడక్ట్‌, టెక్నాలజీ, కేటలాగ్‌, మార్కెటింగ్‌ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని జొమాటో ఫైర్‌ చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆ ఉద్యోగులు విధులకు హాజరుకావడం లేదని సమాచారం.

Microsoft Employees : భారీగా ఉద్యోగాల తొల‌గింపు వాస్త‌వ‌మే..కానీ ఇలా కాదు..

సీఈవో చెప్పినట్లుగానే..
ఉత్పత్తిని పునరుద్ధరించే సమయంలో మిడ్‌లెవల్‌ ఉద్యోగల నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ స్థాయిలో విధుల నిర్వహించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి తొలగింపులు అనివార్యమైనట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ ఇచ్చే అంశంపై ఇప్పటికే జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ సంస్థ ఉద్యోగులకు సమాచారం అందించారు. విధుల నిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగల్ని తొలగిస్తామని చెప్పారు. ఇప్పుడు సీఈవో చెప్పినట్లుగానే తొలగింపులు ఉంటున్నాయని నివేదిక హైలెట్‌ చేసింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్ధిక మాంద్యంతో పాటు ఇతర కారణాల వల్ల 2022-2023 క్యూ2 లో నిరాశాజనకమైన ఫలితాల్ని  రాబట్టింది. సెప్టెంబర్‌ నెల ముగిసే సమయానికి జొమాటో రూ.251కోట్లు నష్టపోయింది.

Jobs : 2,500 మంది తీసి.. 10,000 మంది టీచర్లను.. నియమించుకుంటాం.. ఇదే మా టార్గెట్..

Published date : 19 Nov 2022 07:35PM

Photo Stories