Skip to main content

Jobs Layoffs 2022 : అస‌లు ఎందుకు ఇంత భారీగా ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌.. ఇంకా రానున్న రోజుల్లో ఇది..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కొన్ని కంపెనీలు చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో భారీగా ఉద్యోగుల‌ను ఇంటికి పంపిస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాం‍ద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం.. ఇవన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలను కలవరపెడుతున్నాయి.
source : trueup.io/layoffs

ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఇప్పటికే వరుసగా ఒకదాని తర్వాత మరొకటి కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.  

ఇటీవ‌లే ట్విటర్‌ సీఈవో బాధ్య‌త‌లు తీసుకున్న‌ ఎలాన్‌ మస్క్‌ ఉద్యోగులకు భారీగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ట్విటర్‌లో పనిచేసే మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మందిని ఇంటికి పంపించారు. ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అలాగే మెటా సంస్థ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ ఇటీవ‌లే సంచలన ప్రకటన చేశారు. 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించారు. ఇక ఈ   ఫెస్‌బుక్ 18 సంవత్సరాల చరిత్రలో భారీగా ఉద్యోగుల‌ను తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే స్టీమింగ్ దిగ్గజం డిస్నీ ఉద్యోగాలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మరో చైనీస్ టెక్ కంపెనీ అలీబాబా ఇటీవల ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగుల తొలగింపున‌కు శ్రీకారం చుట్టింది.

ఇంటెల్ చరిత్రలోనే తొలిసారిగా..
అలాగే ప్రముఖ సెమీ కండక్టర్‌ తయారీ సంస్థ ఇంటెల్‌ ఊహించని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్సనల్‌ కంప్యూటర్‌ మార్కెట్‌ డిమాండ్‌ తగ్గడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పీసీ మార్కెట్‌లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా ఇంటెల్‌ 20శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనున్నట్లు, వారిలో సేల్స్‌, మార్కెటింగ్‌ బృంద సభ్యులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంటెల్ చరిత్రలోనే..ఇంత భారీగా సంఖ్య‌లో ఉద్యోగులను తొల‌గింపు ఇదే తొలిసారి.

బైజూస్‌లో కూడా భారీగానే..
వచ్చే ఆరు నెలల్లో 2,500 మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్టు బైజూస్‌ కో–ఫౌండర్‌ దివ్య గోకుల్‌నాథ్‌ తెలిపారు. అలాగే భారత్‌తోపాటు విదేశీ మార్కెట్ల కోసం 10,000 మంది టీచర్లను నియమించుకోనున్నట్టు పేర్కొన్నారు.

దిగ్గజం టెన్సెంట్ గత పదేళ్లలో తొలిసారిగా..
టెక్నాల‌జీ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ దిగ్గజం టెన్సెంట్ గత పదేళ్లలో తొలిసారిగా లేఆఫ్‌ల‌ను ప్ర‌క‌టించింది. త్రైమాసిక రాబ‌డి అంచ‌నాలు అందుకోలేక‌పోయిన త‌ర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. గ‌త క్వార్ట‌ర్‌లో ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలమైనందుకు టెన్సెంట్ దాదాపు 5,500 మంది ఉద్యోగుల‌ను సాగ‌నంపింది.

అమెజాన్ కంపెనీ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో..

it jobs

అమెజాన్ కంపెనీ సంచలన నిర్ణయంవైపుగా కదులుతోంది. జెఫ్ బెజోస్ నేతృత్వంలోని కంపెనీ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 10వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది. దీంతో ఇ-కామర్స్ దిగ్గజం అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. కంపెనీ వార్షిక ప్రణాళిక ప్రక్రియలో భాగంగా హెడ్‌కౌంట్‌ను ఎక్కడ తగ్గించే క్రమంలో ఆయా టీంలు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్థికమాంద్యం, పడిపోతున్న ఆదాయాల నేపథ్యంలో అమెజాన్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎకో స్మార్ట్ స్పీకర్స్‌, అలెక్సా డిజిటల్ అసిస్టెంట్‌లకు బాధ్యత వహించే టీం, అలాగే అమెజాన్ రిటైల్ విభాగాలు, హెచ్‌ఆర్‌ విభాగంలో ఈ కోతలు ఉండనున్నాయి. 

ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా..
గత కొంత కాలంగా ఐటీ రంగంలో గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా.. జాయినింగ్‌ లెటర్స్‌ జారీలో జాప్యం, సంస్థలో తొలగింపులు వంటివి చేపడుతున్నాయి. ఇవి ఆ రంగంలోని ఉద్యోగులను, ఐటీ కొలువు కోసం వేచి చూస్తున్న విద్యార్ధులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా మరికొన్ని సంస్థలు.. ఆఫర్‌ లెటర్స్‌ ఇచ్చిన వారికి.. సదరు ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లుగా సమాచారం కూడా ఇస్తున్నాయి.

కారణం ఇదేనా..!
☛  ఐటీలో ఆన్‌బోర్డింగ్‌ ఆలస్యానికి అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందనే సంకేతాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలోని సంస్థల్లో అధిక శాతం అమెరికాలోని కంపెనీలకు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సేవలందిస్తున్నాయి. అమెరికా మాంద్యం ముంగిట నిలిచిందనే అంచనాల కారణంగా.. అక్కడి కంపెనీల్లో కార్యకలాపాలు మందగిస్తున్నాయి. ఫలితంగా ఆయా సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌ల విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
☛   దీంతో.. సదరు సంస్థలకు సేవలపై ఆధారపడిన మన ఐటీ కంపెనీలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇది అంతిమంగా ఆన్‌ బోర్డింగ్‌లో జాప్యానికి కారణమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, అంతర్జాతీయ ఒడిదుడుకుల కారణంగా కొత్త ప్రాజెక్ట్‌లు రావడం కొంత కష్టంగా ఉంది. ఇది కూడా ఆన్‌ బోర్డింగ్‌లో జాప్యానికి మరో కారణమని చెబుతున్నారు.

Tech Jobs Layoff :
☛ Meta - 11k (13%)
☛ Twitter - 3.7k (50%)
☛ Intel - 20%
☛ Snap - 20%
☛ Netflix - 450
☛ Robinhood - 30%
☛ Stripe, Lyft - 13%
☛ Salesforce - 2k
☛ Amazon - 10k

Published date : 15 Nov 2022 09:30PM

Photo Stories