Microsoft Employees : భారీగా ఉద్యోగాల తొలగింపు వాస్తవమే..కానీ ఇలా కాదు..
సుమారు 1000 మంది ఉద్యోగులను తొలగించినట్లు వస్తున్న వార్తలను తాజాగా కంపెనీ ధృవీకరించింది. అన్ని ఇతర కంపెనీల మాదిరిగానే, తాము కూడా వ్యాపార ప్రాధాన్యతలను సమీక్షిస్తూ, దానికనునుగుణంగా నిర్మాణాత్మక సర్దుబాట్లు చేయనున్నామని తెలిపింది.
Jobs : ఇంటెల్ చరిత్రలోనే తొలిసారిగా.. భారీగా ఉద్యోగులను తొలగింపు.. ఎందుకంట..?!
అలాగే తమ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తూనే, కీలక వృద్ధి రంగాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నామని సంస్థ ప్రతినిధి తెలిపారు. మైక్రోసాఫ్ట్ అనేక విభాగాల్లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించిందని ఈ వారం యాక్సియోస్ నివేదిక ఇటీవల పేర్కొంది. అంతేకాదు సమీప భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకు ముప్పు తప్పదని కూడా తెలిపింది. దీనిపై స్పందించిన సంస్థ ఈ వివరాలను అందించింది.
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో 221,000 మంది..
కేవలం తక్కువ సంఖ్యలో ఉద్యోగులను మాత్రమే తొలగించామని, ఇది మా మొత్తం ఉద్యోగుల సంఖ్యలో కేవలం 1 శాతం కంటే తక్కువ అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి వెల్లడించారు. జూన్ 30 నాటికి మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో 221,000 మంది ప్రస్తుత తొలగింపులు 1శాతం కంటే తక్కువేనని వ్యాఖ్యానించారు.
Work From Home : వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇవే..
ఖర్చులను తగ్గంచుకునే పనిలో..
కాగా పీసీ అమ్మకాలు మందగించిన నేపథ్యంలో ఇంటెల్ కార్ప్ వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలను యోచిస్తున్నట్లు వార్తల అనంతరం తాజా పరిణామం చోటు చేసుకుంది. మహమ్మారి సమయంలో టెక్ పరిశ్రమ చాలా లాభాలను పొందింది. జూమ్ వీడియో, స్లాక్ టెక్నాలజీస్ ,నెట్‌ఫ్లిక్స్ లాంటికి ఆదరణ బాగా పెరిగింది. సోషల్ మీడియా ,ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో నియామకాలు జోరందుకున్నాయి. వేలకొద్దీ స్టార్టప్‌లు కొత్త వెంచర్ క్యాపిటల్‌తో లబ్ది పొందాయి. కానీ ప్రపంచ ఆర్థిక మందగమనం , అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఐరోపాలో ఇంధన సంక్షోభం కారణాల రీత్యా అనేక టెక్నాలజీ కంపెనీలు ఖర్చులను తగ్గంచుకునే పనిలో పడ్డాయి.
ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చేవారం వెలువడనున్న యాపిల్, మెటా, గూగుల్ ఫలితాలు, ఆదాయాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
Jobs : 2,500 మంది తీసి.. 10,000 మంది టీచర్లను.. నియమించుకుంటాం.. ఇదే మా టార్గెట్..