Skip to main content

IT jobs layoffs crisis 2023 : డేంజ‌ర్‌లో ఐటీ ఉద్యోగాలు.. ఇలా చేస్తే మీ ఉద్యోగం సేఫ్‌..!

ఐటీ ఉద్యోగులు ప్ర‌స్తుతం భ‌యం.. భ‌యంతో ఉండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ రోజు ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియని స్థితిలో వీరు ప‌నిచేస్తున్నారు.
software jobs layoff news in telugu
software jobs layoff 2023 details

ఇప్పుడు భారత ఐటీలో మాంద్యం కాదు.. దిద్దుబాటు జరుగుతోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 

కొంద‌రు మాత్రం భయపడే స్థాయిలో ప్రస్తుతం పరిస్థితులు లేవని వారు చెబుతున్నారు. ఉద్యోగం పోయినా మరొక కంపెనీలో చేరుతున్నారు తప్ప రోడ్డున పడ్డ వారెవరూ ఐటీలో లేరని స్పష్టం చేస్తున్నారు. 2001, 2008లో ఐటీ రంగం మందగమనానికి లోనై తిరిగి గాడిలో పడింది. ఏ రంగానికైనా ఒడిదుడుకులు సహజం. ఇందుకు ఐటీ మినహాయింపు కాదని నిపుణులు అంటున్నారు.

➤☛ Meta to cut around 4,000 jobs : ఊహించినట్టే.. షాకిచ్చిన మెటా.. 4000 ఉద్యోగులు ఇంటికి..

ఈ దెబ్బతోనే.. 

it jobs layoff news in telugu

క‌రోనా దెబ్బతో ప్రపంచం అంతా సంప్రదాయ విధానాల నుంచి సాంకేతిక ఆధారిత పద్ధతులవైపు మళ్లింది. దీంతో తయారీ, బ్యాంకింగ్, బీమా, ఎఫ్‌ఎంసీజీ, ఈ-కామర్స్, ఆతిథ్యం, ఆహారం, ఆరోగ్యం, విద్య, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, రవాణా, సరుకు రవాణా.. ఇలా అన్నిరంగాల కంపెనీలూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. 
ఇంకేముంది ఐటీ ప్రోడక్ట్, సర్వీస్‌ కంపెనీలు 2021, 2022లో ఎన్నడూ లేనంతగా ప్రాజెక్టులు చేజిక్కించుకున్నాయి. వీటి ఆదాయమూ ఊహించనంతగా పెరిగింది. కాంట్రాక్టుల రాకతో ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగులను చేర్చుకున్నాయి. కొన్ని కంపెనీలు అయితే అవసరానికి మించి నియామకాలను చేపట్టాయి. ప్రాజెక్టుల ఆశతో బెంచ్‌ను మెయింటెయిన్‌ చేశాయి.

కొంద‌రు మోసం చేసి..
కరోనా మహమ్మారి రాకతో రిమోట్‌ వర్కింగ్‌ విధానం తప్పనిసరి అయింది. నియామక ఇంటర్వ్యూలు వర్చువల్‌ విధానంలో జరిగాయి. ఇదే అదనుగా చాలాచోట్ల అసలు అభ్యర్థికి బదులు మరొకరు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇలా ఉద్యోగం సాధించిన వారిలో కొందరైతే ఒప్పందం కుదుర్చుకుని సబ్జెక్ట్‌ తెలిసివారితో పనులు చేయించుకున్నారు. గతంలో ఫ్రెషర్లలో మెరిట్‌ ఉన్నవారికే ఉద్యోగాలు వచ్చాయి. కరోనా సమయంలో ఒక మోస్తరు అభ్యర్థులకు సైతం జాబ్స్‌ వచ్చాయంటే ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు ఏ స్థాయిలో వెల్లువెత్తాయో అర్థం చేసుకోవచ్చు.

☛ 2.70 లక్షల మంది తొలగింపు..ఎప్పుడు? ఎక్కడా?

నైపుణ్యం ఉన్నవారు అదనపు సంపాదన కోసం ఒకటికి మించిన ఉద్యోగాలు (మూన్‌లైటింగ్‌) చేశారు. ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్‌ ఎప్పటి నుంచో ఉంది. కానీ గడిచిన రెండేళ్లలో ఇది విస్తృతం అయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంతో ఇంటి పట్టున ఉండే ఉద్యోగాలు చేసినవారికి ఇది కలిసి వచ్చింది. 

ఈ స్థాయిలో ఇప్పటి పరిస్థితులు లేవ్‌..

it jobs news in telugu

మహమ్మారి తెచ్చిన మార్పులతో అన్ని రంగాల్లోని కంపెనీలూ సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. అందుకే గడచిన రెండు సంవత్సరాల స్థాయిలో ఇప్పటి పరిస్థితులు లేవు. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు కొత్త ప్రాజెక్టుల రాకలో స్పీడ్‌ తగ్గింది. క్లయింట్‌ అవసరాలకు అనుగుణంగా ఐటీ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన, కోడింగ్‌ చేస్తాయి. పరీక్షలు జరిపి అడ్డంకులు లేవని నిర్ధారించుకున్నాక ఆ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తాయి. ఆ తర్వాత క్లయింట్లకు కావాల్సిన సపోర్ట్‌ను ఒప్పందంలో భాగంగా ఐటీ కంపెనీలు కొన్నేళ్లపాటు కొనసాగిస్తాయి. 

Shocking News: యాపిల్‌ ఉద్యోగుల గుండెల్లో గుబులు

కరోనా కాలంలో వచ్చిన ప్రాజెక్టులు దాదాపు ఇప్పుడు సపోర్ట్‌ దశకు వచ్చాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. అంటే ప్రస్తుతం సపోర్ట్‌ సేవలు అందించే సిబ్బందికే ఎక్కువ పని ఉంటుందన్నది వారి మాట. సదరు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన కంపెనీకి కొత్త ప్రాజెక్టులు లేకపోతే డిజైన్, కోడింగ్, టెస్టింగ్‌ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు మరో మార్గాలను వెతుక్కుంటున్నారు. కరోనా కాలంలో కొత్త కంపెనీలు పుట్టుకొచ్చినందున ఈ విభాగాల్లో ఉద్యోగావకాశాలకు కొరత లేదని మార్కెట్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

కరోనా కాలంలో ఉద్యోగులు మూడు రెట్ల వరకు వేతనంతో..

it jobs 2023 telugu news

మరోవైపు టెక్నాలజీ రోజురోజుకూ వేగంగా మారుతోంది. నూతన ప్రాజెక్టులు తగ్గాయి. కరోనా కాలంలో ఉద్యోగులు మూడు రెట్ల వరకు వేతనం అందుకోవడంతో ప్రస్తుతం కంపెనీలకు భారంగా పరిణమిస్తోంది. అందుకే వ్యయ నియంత్రణతోపాటు వ్యాపార పునర్వ్యవస్థీకరణకు నడుం బిగించాయి. కొత్త సాంకేతికతకు అప్‌గ్రేడ్‌ కాని ఉద్యోగులకు స్వస్తి పలుకుతున్నాయి.

IT: ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల ఉద్యోగాలు తొల‌గింత‌... ఐటీ అంటేనే భ‌య‌ప‌డుతున్న ఉద్యోగులు

హైబ్రిడ్‌ లేదా వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ విధానాలవైపు మళ్లడంతో ఉద్యోగులు ఆఫీసుకు రాక తప్పడం లేదు. తమకు బదులుగా ఇంకొకరి సాయంతో ఇంటర్వ్యూ పూర్తి చేసినవారు నైపుణ్య పరీక్షల్లో విఫలం అవుతున్నారు. అలాగే ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తున్నవారిని హెచ్‌ఆర్‌ విభాగాలు ఏరివేస్తున్నాయి. బ్యాంకు స్టేట్‌మెంట్స్, ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాల ఆధారంగా మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వారిని గుర్తించి సాగనంపుతున్నాయి. పని లేక బెంచ్‌పై ఖాళీగా కూర్చున్న సిబ్బందిని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సంస్థలు ఇంటికి పంపించివేస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే మాంద్యం బూచి చూపి సిబ్బంది సంఖ్యలో కోత విధిస్తున్నాయి. 

ఇందుకే ఐటీకి భవిష్యత్తు ఎప్పుడూ..

it layoff news 2023

సాంకేతికత ఏదైనా సామాన్యుడికి చేరితేనే భవిష్యత్తు. ఫ్యూచర్‌ను అంచనావేసి అందుబాటులోకి తెచ్చిన ఏ పరిష్కారమైనా ఆదరణ చూరగొంటుంది. ఇప్పుడు ఐటీలో అదే జరిగింది. ఒకప్పుడు బ్యాంకులో క్యూలో నిలుచున్న రోజులు గుర్తుండే ఉంటాయి. నేడు పేమెంట్, బ్యాంకింగ్‌ యాప్స్‌తో క్షణాల్లో పని కానిచ్చేస్తున్నాం.

H-1B Visa: ఉద్యోగ కోతల వేళ భారతీయ టెకీలకు శుభవార్త..హెచ్‍-1బీ వీసా ఉన్న వారి భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేయెచ్చు..

ఫుడ్‌ డెలివరీ, రైడ్‌ హెయిలింగ్‌ యాప్స్, ఓటీటీ వేదికలు, సామాజిక మాధ్యమాలు.. ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే అవుతుంది. ఈ అప్లికేషన్స్‌ను (యాప్స్‌) నడిపించేది సాంకేతికతనే. మానవ జీవితంలో సాంకేతికత లేకపోతే మనుగడ అసాధ్యం అన్నంతగా ముడిపడింది. ఆర్థికంగా, సామాజికంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకే ఐటీకి భవిష్యత్తు ఎప్పుడూ ఉంటుందన్నది నిపుణుల మాట.

ఇప్పుడు ప్రపంచమే..

it news 2023 telugu

ఒకప్పుడు యూఎస్‌ విపణిపైనే ఐటీ ఆధారపడేది. ఇప్పుడు ప్రపంచమే పెద్ద మార్కెట్‌ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎండ్‌ యూజర్స్‌ ఉన్నారు. ఒక దేశంలో బ్యాంకు మూతపడిందనో, ఆ దేశం మాంద్యంలో చిక్కుకుందనో మొత్తం ఐటీ పరిశ్రమ నిలిచిపోదు. నిపుణులైన అపార మానవ వనరులు భారత్‌ సొంతం. అంతే కాదు ఇక్కడ లభించే సేవలు చౌక. అందుకే దిగ్గజ మల్టీ నేషనల్‌ కంపెనీలు భారత్‌ వైపు చూస్తున్నాయి.

➤☛ Central Government Jobs 2023 : శుభ‌వార్త‌.. కేంద్రంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు.. ఖాళీల వివ‌రాలు ఇవే..!

➤☛ 9,79,327 లక్షల ఉద్యోగాల శాఖ‌ల వారిగా పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి
 
ఇదే భారతీయుల ప్రత్యేకత..

it jobs for indians telugu news

భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల ప్రకారం.. ఇక్కడ మానవ వనరులకు అయ్యే ఖర్చు తక్కువ. అధిక నైపుణ్యం ఉన్నవారు దేశంలో కోకొల్లలు. ఇతర భాషలూ మాట్లాడగలరు. వివిధ దేశాల్లో ఉన్న క్లయింట్ల సమయం ప్రకారం పనిచేసేందుకు వెనుకాడరు. తార్కిక ఆలోచన (లాజికల్‌ థింకింగ్‌) భారతీయులకు ఎక్కువ. క్లయింట్ల ఆలోచనను సులువుగా అర్థం చేసుకుంటారు. కొన్నేళ్లుగా విద్యావిధానంలో వచ్చిన మార్పులు ఇందుకు దోహదం చేస్తున్నాయి. మరో ముఖ్య విషయం టీమ్‌ వర్క్‌ భారతీయుల ప్రత్యేకత. సమష్టి కృషి వల్ల పనులను నాణ్యత తగ్గకుండా, త్వరితగతిన పూర్తి చేయగలరు. కోడింగ్‌లో భారతీయులు దిట్ట.

కొత్త వారిని ఎక్కువగా..

it jobs for fresher telugu news

ఐటీ కంపెనీల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్యాప్టివ్‌. అంటే తమ గ్రూప్‌ కంపెనీల కోసం సొంతంగా ఐటీ సేవలు, బ్యాక్‌ ఎండ్‌ సపోర్ట్‌ అందించేవి. మరొకటి క్లయింట్లు, ఎండ్‌ యూజర్ల కోసం పనిచేసే ఐటీ కంపెనీలు. కరోనా కాలంలో భారత్‌కు క్యాప్టివ్‌ కంపెనీలు క్యూ కట్టాయి. గోల్డ్‌మన్‌ శాక్స్, పెప్సికో, అపెక్స్‌ ఫండ్, సిట్కో ఫండ్, యూబీఎస్, స్టేట్‌ స్ట్రీట్‌ వంటివి వీటిలో ఉన్నాయి. క్యాప్టివ్‌ కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాయి. ఈ రిక్రూట్‌మెంట్‌ ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. రూ.5–12 లక్షల వార్షిక వేతనాల విభాగంలో కొత్త వారిని ఎక్కువగా చేర్చుకుంటున్నాయి. క్లయింట్ల కోసం పనిచేసే ఐటీ కంపెనీలు కొత్త నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరోవైపు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో రిక్రూట్‌మెంట్‌ జరుగుతూనే ఉంది.

➤☛ IT Crisis: సాఫ్ట్‌వేర్ జాబ్ దొర‌క‌డం ఇంత క‌ష్ట‌మా... 150 కంపెనీల‌కు అప్లై చేస్తే...!

పల్లెలకు పాకిన‌.. ఐటీ :

it jobs

నియామకాలు కొనసాగుతుండడంతో ఐటీతో ముడిపడిన శిక్షణ సంస్థలు కొత్త కోర్సుల కోసం వచ్చిన అభ్యర్థులు, ఫ్రెషర్లతో సందడిగా ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ అంటే తెలియనివారూ ఇక్కడికి వస్తున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇంగ్లిష్‌పై ఏమాత్రం పట్టు ఉండదు. అయినా నేర్చుకుని స్థిరపడవచ్చన్నది ప్రగాఢ విశ్వాసం అభ్యర్థుల్లో కనపిస్తోంది. మారు మూల పల్లెలకూ ఐటీ చొచ్చుకుపోయింది. కరోనా కారణంగా స్వగ్రామాల్లో ఇంటికి చేరి ఉద్యోగాలు చేసినవారు లక్షల మంది ఉన్నారు. లక్షల్లో వేతనం అందుకుంటున్న వీరిని చూసిన ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల వారికి ఐటీలో ఉద్యోగం సంపాదించాలనే ఆశ పుట్టింది.

➤☛ IT Jobs: కోడింగ్ రాక‌పోయిన సాఫ్ట్‌వేర్ జాబ్‌... ఇలా చేస్తే జాబ్ గ్యారెంటీ

ఇప్పటికీ అధిక వేతనాన్ని..

it jobs news telugu

ఆఫర్‌ లెటర్లు అందుకునే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఆఫర్స్‌ షాపింగ్‌ జరుగుతోంది. అంటే ఒక సంస్థ ఇచ్చిన ఆఫర్‌ను చూపించి మరో కంపెనీలో అధిక వేతనాన్ని డిమాండ్‌ చేయడం. ఇటీవల యూఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన హెచ్‌1బీ వీసాలు అందుకున్న వారిలో భారతీయులూ ఉన్నారు. వీరిలో అనలిటిక్స్, క్లౌడ్‌ టెక్నాలజీ నిపుణులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. భారత ఐటీ నిపుణులకు డిమాండ్‌ను సూచిస్తోంది ఇది. 

లే ఆఫ్స్‌ అనే మాటలు వింటున్నాం గాని, తమ కంపెనీలో అలాంటిదేమీ జరగడం లేదని యూఎస్‌కు చెందిన దిగ్గజ టెక్నాలజీ సంస్థలో పని చేస్తున్న సాయి శ్రీహిత్‌ తెలిపారు. ‘నా స్నేహితులు చాలా మంది ఐటీలో ఉన్నారు. ఉద్యోగం పోయిందనే మాట వారి నుంచి నేను వినలేదు. కొందరు కొత్త కోర్సులు నేర్చుకుని పని చేస్తున్న సంస్థలో రోల్‌ మారడమో, లేదా మరొక కంపెనీలో అధిక వేతనానికి చేరడమో చేస్తున్నారు’ అని అన్నారు.

➤☛ IT Crisis: ఎవ‌ర్ని తొల‌గించాలో చెప్పండి... ఉద్యోగుల మెడ‌పై క‌త్తి పెట్టిన ఫేస్‌బుక్‌

ఈ ఏడాది జీతాలు త‌క్కువే..
ప్రాజెక్టులు వస్తాయన్న అంచనాలతో బెంచ్‌ను కంపెనీలు మెయింటైన్‌ చేస్తాయి. అంటే ప్రాజెక్టు లేనప్పటికీ ఉద్యోగులను చేర్చుకుంటాయి. సిబ్బందికి వేతనాలూ చెల్లిస్తాయి. ఎప్పుడైతే ప్రాజెక్టులు రావని నిర్ధారణ అవుతుందో సిబ్బంది తీసివేతలు మొదలవుతాయి. కొన్ని కంపెనీలు కొన్ని నెలల వేతనం ముందే చెల్లించి సిబ్బందిని ఇంటికి పంపిస్తాయి. కొన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధించడం లేదా నిలిపివేయడం చేస్తాయి. దీంతో ఉద్యోగి చేసేదేమీ లేక రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే వాతావరణం నెలకొందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టుల సంఖ్య తగ్గడంతో 2023లో వేతన పెంపు నెమ్మదించవచ్చని వారు అంటున్నారు.

ఈ కోర్సులకు డిమాండ్‌..

software courses in telugu

సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ వంటివి చొచ్చుకు వస్తున్నాయి. టెక్నాలజీ మార్పులకు తగ్గట్టుగా ఈ రంగంలో పనిచేస్తున్న మానవ వనరులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిందే. లేదంటే ఇంటిబాట తప్పదని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. 2023లో కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంపై ఈ రంగ నిపుణులు దృష్టి సారిస్తున్నారు. సర్టిఫికెట్‌ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఫుల్‌ స్టాక్‌ డెవలపర్, టెస్టింగ్, డేటా సైంటిస్ట్, క్లౌడ్‌ ఇంజినీర్, స్క్రమ్‌ మాస్టర్‌ వంటి నిపుణులకు భారీగా డిమాండ్‌ ఉంది. 

ఏదో ఒక ఉద్యోగం.. అని..
2020కి ముందు శిక్షణ సంస్థల్లో ఐటీ కోర్సులు నేర్చుకున్న వారిలో 40 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2021, 2022లో అభ్యర్థుల సంఖ్య రెండింతలైంది.70–80 శాతం మంది జాబ్స్‌ సంపాదించారు. గడచిన రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం నేర్చుకోవడానికి వచ్చే అభ్యర్థుల సంఖ్య 25 శాతం తగ్గింది. సక్సెస్‌ రేట్‌ 50 శాతం ఉంది. మాంద్యం వార్తల నేపథ్యంలో అభద్రతా భావం వల్లే శిక్షణ కోసం వచ్చేవారి సంఖ్య తగ్గిందని ఇన్‌స్టిట్యూట్స్‌ చెబుతున్నాయి. 

మరోవైపు ఏళ్ల తరబడి గ్రూప్స్‌కు సన్నద్ధం అయినవారు ఇప్పుడు ఐటీ వైపు చూస్తున్నారు. కొత్తగా శిక్షణ కోసం వచ్చిన వారిలో ఇటువంటి వారి సంఖ్య 50 శాతంపైగా ఉంటోందని సమాచారం. సబ్జెక్ట్‌ నేర్చుకుంటే ఐటీలో ఏదో ఒక ఉద్యోగం వస్తుందన్నది వారి నమ్మకం.

➤☛ Accenture Lay off 19,000 employees : భారీగా కోత.. ప్ర‌ముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్‌లో 19వేల మంది ఉద్యోగుల‌ను ఇంటికి.. కారణం ఇదే..

బీటెక్‌లో..

btech students jobs 2023 telugu news

ఒకప్పుడు బీటెక్‌లో ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, ఐటీతోపాటు ఎంసీఏ చదివినవారు ఐటీ వైపు వచ్చేవారు. మహమ్మారి కాలంలో, అలాగే ప్రస్తుతం డిగ్రీ పూర్తి అయినవారు, ఇతర విద్యార్హతలు ఉన్నవారూ సంబంధిత కోర్సులు చేసి ఐటీలో ప్రవేశిస్తున్నారు. అధిక వేతనాలు వీరిని ఆకర్షిస్తున్నాయి. ప్రాజెక్టులు వెల్లువెత్తడంతో కంపెనీలు అభ్యర్థుల విద్యార్హతలను పట్టించుకోకుండా నియామకాలు చేపట్టాయి. నాన్‌ బీటెక్, నాన్‌ ఐటీ నుంచి ఇటువైపు రావడం 2021 నుంచి ట్రెండింగ్‌ అయింది. 

హెచ్‌సీఎల్‌లో రూ.20 లక్షల వార్షిక వేతనం ఆమెది. ఉద్యోగం వదిలేయాలని డిసైడ్‌ అయ్యారు. నూతన సాంకేతికత నేర్చుకుని యూఎస్‌ వెళ్లాలన్నది ఆమె ఆలోచన. కొసమెరుపు ఏమంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న గ్రూప్‌–2 స్థాయి అధికారి అయిన తన భర్తను సైతం రాజీనామా చేయించి.. ఇద్దరూ విదేశీ గడ్డపై స్థిరపడాలని ఆమె నిర్ణయించుకోవడం. ప్రపంచం అంతా మందగమనం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ ఒక్క సంఘటన చాలు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉన్న ఉజ్వల భవిష్యత్తు గురించి చెప్పడానికి!

చ‌ద‌వండి: వెనక్కి తగ్గిన గూగుల్‌... ప్రస్తుతానికి చాట్‌జీపీటీ దే రాజ్యం

ఐటీ వేతనాలు ఇలా..

it jobs news telugu 2023

కొత్త కోర్సు నేర్చుకుని అప్‌గ్రేడ్‌ అయినవారు అదే సంస్థలో సగటున వేతనంలో 70-80 శాతం హైక్‌ సాధిస్తున్నారు. కంపెనీ మారినవారైతే రెండింతల శాలరీతో జాక్‌పాట్‌ కొట్టేస్తున్నారట. కీలక విభాగాల్లో పనిచేస్తున్న నిపుణుల జీతాలు మూడు రెట్ల వరకు అధికం అయ్యాయంటే ప్రస్తుత డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. కంపెనీ, ఉద్యోగి సామర్థ్యాలను బట్టి కోవిడ్‌ ముందు, ప్రస్తుతం వార్షిక వేతనాలు సగటున ఇలా ఉన్నాయి. 

అనుభవం కోవిడ్‌ ముందు ప్రస్తుతం
  (వార్షిక వేతనాలు లక్షల్లో)  
ఫ్రెషర్స్‌ రూ.2–5 రూ.4–10
1–3 ఏళ్లు రూ.5–8 రూ.8–20
3–10 ఏళ్లు రూ.6–16 రూ.15–40
10–15 ఏళ్లు రూ.15–25 రూ.25 లక్షల – రూ.1 కోటి
15 ఏళ్లకుపైబడి రూ.30–70  రూ.40 లక్షల – రూ.1 కోటి
     

భారత్‌లో పెద్దగా లే ఆఫ్స్‌..

lawnya kumar

ఐటీ రంగంలో నైపుణ్యం ఉన్నవారికే భవిష్యత్తు ఉంటుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అభ్యర్థులు అప్‌గ్రేడ్‌ అవ్వాల్సిందే. అనలిటిక్స్, క్లౌడ్‌ టెక్నాలజీ, సీఆర్‌ఎం విభాగాల్లో నిపుణులకు డిమాండ్‌ విపరీతంగా ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాక ప్రభావం ఏ రంగాలపై ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయి ఉండవచ్చు. అయినంత మాత్రాన భయపడేంత పరిస్థితులు లేవు. భారత్‌లో పెద్దగా లే ఆఫ్స్‌ లేవు. నైపుణ్యం ఉంటే ఒక కంపెనీ కాకపోతే మరొక కంపెనీలో ఉద్యోగం లభిస్తోంది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందిన వారికే ముప్పు. కొత్త ప్రాజెక్టుల విషయంలో స్పష్టత రాకపోవడంతో బెంచ్‌ మీదకు తీసుకోవడం లేదు 
                                                – నానాబాల లావణ్య కుమార్,  కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్‌.

ఉద్యోగం పోవడం సమస్యే కాదు.. కానీ.. : 

రేచల్‌ స్టెల్లా రాజ్, ఇంటర్నల్‌ టాలెంట్‌ అక్విజిషన్‌ రిక్రూటర్‌

ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో గతేడాది వరకు ఆఫర్‌ షాపింగ్‌ చేసేవారి సంఖ్య 20 శాతం ఉండేది. ఇప్పుడు ఇలాంటి వారు ఏకంగా 50 శాతం ఉంటున్నారు. అభ్యర్థుల్లో 20 శాతం మంది లే ఆఫ్స్‌ కారణంగా ఉద్యోగం పోయినవారు వస్తున్నారు. జాబ్‌ పోయిందనేది సమస్యే కాదు. అభ్యర్థిలో టెక్నికల్‌ స్కిల్స్‌ ఉన్నాయా లేదా అన్నదే కంపెనీలకు ప్రధానం. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం అక్కర్లేదు. సరిగ్గా కమ్యూనికేట్‌ చేయగలిగితే చాలు. పురుషులైతే 1–2 ఏళ్లు గ్యాప్‌ ఉన్నా ఫర్వాలేదు. మహిళలు అయితే ఎంత గ్యాప్‌ ఉన్నా సంబంధిత సాంకేతికతలో నైపుణ్యం ఉంటే జాబ్‌ వస్తోంది. అభ్యర్థులు ఎవరైనా ఇప్పుడు వేతనంలో కనీసం 30 శాతం హైక్‌ డిమాండ్‌ చేస్తున్నారు 
                                               – రేచల్‌ స్టెల్లా రాజ్, ఇంటర్నల్‌ టాలెంట్‌ అక్విజిషన్‌ రిక్రూటర్‌.
 

ప్రస్తుతం ప్యాకేజ్‌ గురించి అస‌లు ఆలోచించవద్దు..: 

రమణ భూపతి, చైర్మన్, క్వాలిటీ థాట్‌ గ్రూప్‌

కొత్తగా ఐటీ రంగంలోకి వచ్చేవారు, కెరీర్‌ గ్యాప్‌ ఉన్నవారు ప్యాకేజీ గురించి ఆలోచించకుండా నైపుణ్యం పెంచుకోవడంపైనే ఫోకస్‌ చేయాలి. ఏ కోర్స్‌ చేస్తే మెరుగ్గా ఉంటుందో కెరీర్‌ గైడెన్స్‌ ద్వారా తెలుసుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యంతో అడుగుపెట్టాలి. టెక్నికల్‌ సబ్జెక్ట్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు చూసుకోవాలి. విభిన్న కంపెనీల్లో ఓపికగా ఇంటర్వ్యూల్లో పాల్గొని నాలెడ్జ్‌ సంపాదించాలి. డిగ్రీ చదివి మంచి ఇన్‌స్టిట్యూట్‌లో 6–12 నెలలపాటు శిక్షణ తీసుకుంటే చాలు. ఐటీ రంగంలో జాబ్‌ తప్పనిసరిగా దొరుకుతుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నట్టయితే నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. నైపుణ్యం ఉంటే ఐటీ రంగంలో నిలదొక్కుకోవచ్చు. నియామక పత్రాలు అందుకుంటున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు
                                                                          - రమణ భూపతి, చైర్మన్, క్వాలిటీ థాట్‌ గ్రూప్‌. 

Published date : 30 Apr 2023 05:57PM

Photo Stories