Accenture Lay off 19,000 employees : భారీగా కోత.. ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్‌లో 19వేల మంది ఉద్యోగులను ఇంటికి.. కారణం ఇదే..
కంపెనీ ఆదాయ క్షీణత నేపథ్యంలో 19వేల ఉద్యోగాలను తీసివేయనుంది. అటు వార్షిక రాబడి, లాభాల అంచనాలను కూడా తగ్గించింది. ఈ మేరకు కంపెనీ మార్చి 23వ తేదీన (గురువారం) అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో ఎంతమంది భారతీయ ఉద్యోగులు ప్రభావితం కానున్నారనేదానిపై స్పష్టత లేదు. తమ సిబ్బందిలో 2.5 శాతం లేదా 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విటర్, ఎరిక్సన్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున్న ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టిన విషయం తెల్సిందే.
➤☛ IT Jobs: కోడింగ్ రాకపోయిన సాఫ్ట్‌వేర్ జాబ్... ఇలా చేస్తే జాబ్ గ్యారెంటీ
రాబోయే 18 నెలల్లో ఇంకా ఉద్యోగులను..
సగానికి పైగా తొలగింపులు నాన్ బిల్ కార్పొరేట్ ఫంక్షన్ల సిబ్బందిని ప్రభావితం చేస్తాయని వెల్లడించింది. మరోవైపు యాక్సెంచర్ తమ వార్షిక రాబడి వృద్ధిని కూడా కుదించుకుంది. గతంలో అంచనా వేసిన 8-11 శాతంతో పోలిస్తే 8-10శాతం మధ్య ఉంటుందని భావిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో, ముఖ్యంగా వ్యూహాత్మక వృద్ధి ప్రాధాన్యతలకు మద్దతు నిమిత్తం నియామకాలను కొనసాగిస్తున్న క్రమంలో తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి , ఖర్చులను తగ్గించడానికి ఈ చర్యలను ప్రారంభించామని రాబోయే 18 నెలల్లో ఉద్యోగుల కోతలుంటాయని తెలిపింది. అంతేకాదు గతంలో 11.20 -11.52 డాలర్లతో పోలిస్తే ఒక్కో షేరుకు సంపాదన10.84-11.06 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
➤☛ IT Crisis: ఎవర్ని తొలగించాలో చెప్పండి... ఉద్యోగుల మెడపై కత్తి పెట్టిన ఫేస్‌బుక్