Job Opportunities In IT Sector: ఐటీలో మళ్లీ నియామకాల సందడి.. వీరికి డిమాండ్ ఎక్కువ
ముంబై: ఐటీ రంగంలో మళ్లీ నియామకాలు పుంజుకోనున్నాయి. వచ్చే ఏడాది నాటికి 8.5 శాతం మేర పెరుగుతాయని హైరింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఇండీడ్’ అంచనా వేసింది. గత రెండేళ్లుగా ఐటీ రంగంలో నియామకాల పరంగా స్తబ్దత వాతావరణం చూస్తుండడం తెలిసిందే. గతేడాది వ్యాప్తంగా నిపుణులకు ఐటీ రంగంలో డిమాండ్ తగ్గగా.. ఇక మీదట ఇది పుంజుకోనున్నట్టు ఇండీడ్ తెలిపింది.
ఇండీడ్ సంస్థకు చెందిన హైరింగ్ ట్రాకర్, ఇండీడ్ ప్లాట్‌ఫామ్ ఇండియా డేటా ఆధారంగా ఈ వివరాలు విడుదల చేసింది. ప్రస్తుతం ఇండీడ్ ప్లాట్‌ఫామ్‌పై నమోదయ్యే నియామకాల్లో 70 శాతం సాఫ్ట్‌వేర్ ఆధారితమేనని ఈ సంస్థ తెలిపింది. కంపెనీలు ఏఐ, మెషిన్ లెరి్నంగ్ (ఎంఎల్)బ్లాక్‌చైన్ వంటి సాంకేతికతలను వినియోగిస్తుండం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాలకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ బలపడుతుండడాన్ని సైతం ప్రస్తావించింది.
వీరికి డిమాండ్ ఎక్కువ..
అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, పీహెచ్‌పీ డెవలపర్ నియామకాలకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, నెట్ డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్, డెవ్‌ఆప్స్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, ఫ్రంట్ ఎంట్ డెవలపర్‌లకు సైతం డిమాండ్ పెరుగుతున్నట్టు తెలిపింది.
ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు, కొత్త ఫీచర్లు తీసుకురావాల్సిన అవసరం సైతం డిమాండ్‌కు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. ‘‘ఐటీ రంగం ఎక్కువ మందికి ఉపాధి కలి్పస్తోంది. కాకపోతే ఇటీవలి త్రైమాసికాల్లో నియామకాలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ అనిశి్చతుల నేపథ్యంలో కంపెనీలు అప్రమత్త ధోరణితో వ్యవహరించాయి. ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు చోటు చేసుకుంటోంది. కంపెనీలు నియామకాలు పెంచుకోవడంపై దృష్టి సారించాయి. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీలు) ఈ నియామకాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి’’అని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు.
Tags
- it company
- Software Jobs
- IT Companies
- Indian IT company
- Software Jobs For Freshers
- Software Developer
- Software Companies
- Software Company
- IT Sector
- IT sector hiring
- IT Sector Growth
- demand in it sector
- it sector growth rate
- MumbaiITRecruitment
- IndeedHiringPrediction
- ITJobGrowth
- ITRecruitmentIncrease
- ITSectorDemand
- ITHiringForecast
- ITJobMarket
- RecruitmentTrends
- ITsectorjobs
- sakshieducationlatestnews