Skip to main content

Meta to cut around 4,000 jobs : ఊహించినట్టే.. షాకిచ్చిన మెటా.. 4000 ఉద్యోగులు ఇంటికి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ముందుగా ఊహించినట్టే.. మెటా ఉద్యోగుల‌కు భారీ షాక్ ఇచ్చింది. ఈ కంపెనీ దాదాపు 4000 మంది ఉన్న‌త ఉద్యోగుల‌ను తొల‌గిస్తుంది. నిరంత‌రం ఉద్యోగులు మా ఉద్యోగాలు ఉంటాయో.. పోతాయో అన్ని భ‌యంతో ఉద్యోగాలు చేస్తున్నారు.
facebook ceo mark zuckerberg news telugu
mark zuckerberg

ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా మరో సారి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్‌ కథనం ప్రచురించింది. 

☛ 2.70 లక్షల మంది తొలగింపు..ఎప్పుడు? ఎక్కడా?

మేనేజర్లుకు మెటా మెమో.. 

facebook telugu news

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. తాజా లేఆఫ్స్‌పై మేనేజర్లుకు మెటా మెమో పంపింది. ఆ మెమోలో ఉద్యోగుల్ని కోత విధించే విషయంలో సిద్ధంగా ఉండాలని సూచించింది. దీంతో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌,ఇన్‌స్టా, వర్చువల్‌ రియాలిటీ సంస్థ రియాలిటీ ల్యాబ్స్‌,క్విస్ట్‌ హార్డ్‌ వంటి విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. కాస్ట్‌ కటింగ్‌ విషయంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 10 వేల మంది ఉపాధి కోల్పోనున్నట్లు జుకర్‌ బర్గ్‌ ఈ ఏడాది మార్చి నెలలో ప్రకటించిన విషయం తెలిసింది. ఆ ప్రకటనకు కొనసాగింపుగానే ఇప్పుడు తొలగింపుల అంశం మరోసారి  తెరపైకి వచ్చింది.   

కొత్త మేనేజర్ల పర్యవేక్షణలో..
తాజాగా మేనేజర్‌లకు పంపిన మెమోలో ఉద్యోగులు సైతం కొత్త మేనేజర్ల పర్యవేక్షణలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని, వర్క్‌ను విభజించినప్పుడు వివిధ విభాగాల ఉద్యోగులు వారితో పనిచేయాల్సి వస్తుందని సూచించింది.  కాగా, ఈ సందర్భంగా మెటా ప్రతినిధి లేఆఫ్స్‌పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.

Shocking News: యాపిల్‌ ఉద్యోగుల గుండెల్లో గుబులు

ఇది రెండోసారి..  
5 నెలల్లో మెటా భారీగా ఉద్యోగాలను తొలగించడం ఇది రెండో సారి. గత నవంబరులో 13శాతంతో 11,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ ఏడాది మార్చిలో ఉద్యోగుల్ని మరోసారి తొలగిస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలియజేసింది. కొత్త నియామకాల్ని నిలిపివేసింది. ‘ప్రతికూల వ్యాపార’ పరిస్థితుల నేపథ్యంలో, సంస్థ ఆర్థిక స్థితిని కాపాడుకునేందుకు వ్యయాలు తగ్గించుకుంటున్నామని, ఇందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నట్లు మెటా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Published date : 19 Apr 2023 01:48PM

Photo Stories