Shocking News: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు
త్వరలో స్పష్టత...!
బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ప్రకారం, ఐఫోన్ మేకర్ తన కార్పొరేట్ రిటైల్ టీమ్స్‌లో కోతలను విధిస్తున్నట్టు తెలుస్తోంది. కంపెనీ అభివృద్ధి డెవలప్‌మెంట్ అండ్ ప్రిజర్వేషన్ బృందాలపై ఈ లేఆఫ్స్ ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు, అయితే ఎంతమందిని తొలగించనున్నారనే దానిపై స్పష్టతలేదు. మరోవైపు ఉద్యోగాలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని,లేదంటే తొలగింపులు తప్పవని ఉద్యోగులను యాపిల్ హెచ్చరించినట్టు బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది. దీనిపై యాపిల్ అధికారిక ప్రకటన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
చదవండి: మరో పేపర్ లీక్... పరీక్ష సమయానికి ముందే వాట్సప్‌లో చక్కర్లు
వరుసగా తొలగింపులు...!
కాగా ఫెడ్ అధిక వడ్డీ రేట్టు, ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళన నేపథ్యంలో ఇటీవలి కాలంలో టెక్ కంపెనీలు కూడా ఇప్పటికే భారీగా ఉద్యోగాల కోతను విధించిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్ మాతృసంస్థ రెండు దఫాలుగా 21వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ 12వేల మందికి, అమెజాన్ పలు రౌండ్లలో ఇప్పటివరకు 27వేల ఉద్యోగాలకు ఉద్వాసన పలికింది.