Skip to main content

Success Story: ఓ చిన్న ఆలోచ‌న కోట్లు కురిపిస్తోంది... మేఘ‌నా నారాయ‌ణ్ స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా...

స‌మ‌స్య‌ల్లోనుంచే ప‌రిష్కారం ల‌భిస్తుంది. అలాగే ఓ తల్లి త‌న చిన్నారికి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అందించాల‌నే ఆలోచ‌న నేడు కోట్లు కురిపిస్తోంది. క‌రోనా నేర్పిన పాఠాల‌తో ప్ర‌జ‌ల జీవ‌న‌శైలి పూర్తిగా మారింది. ఆరోగ్య‌క‌ర‌మైన భోజ‌నానికే ఎక్కువమంది ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అలాంటిది త‌మ గారాల పిల్ల‌ల‌కు ఆహారం అందించే విష‌యంలో త‌ల్లిదండ్రులు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఈ చిన్న పాయింట్‌ను ప‌ట్టుకుని ఆ త‌ల్లి ప్రారంభించిన కంపెనీనే హోల్సమ్ ఫుడ్స్. దీన్ని ప్రారంభించిన మేఘనా నారాయణ్ స‌క్సెస్ జ‌ర్నీ ఇలా సాగింది....
Wholsum Foods co Founder Meghana Narayan
Wholsum Foods co Founder Meghana Narayan

చ‌ద‌వండి: రోడ్ల వెంట తిరుగుతూ ప‌నిచేసి... నేడు ఒక్క ఐడియాతో కోట్లు సంపాదిస్తోందిలా

కూతురు కోసం చేసిన ప్రయత్నం..
పుణెకు చెందిన మేఘనా నారాయణ్‌కు పిల్లల పోషణ, ఆరోగ్యం పట్ల మక్కువ ఎక్కువ. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించాల‌ని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో శౌరవి మాలిక్, ఉమంగ్ భట్టాచార్య అనే మరో ఇద్దరితో కలిసి 2015లో పిల్లల కోసం ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులను అందించే హోల్సమ్ ఫుడ్స్ (స్లర్ప్ ఫార్మ్ అండ్‌ మిల్లె) అనే కంపెనీని స్థాపించారు. తన పాపాయికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ఆమె చేసిన ప్రయత్నాలే ఆమెను ఈ వ్యాపారం ప్రారంభించేలా చేశాయి. ఈ సంస్థలో ప్రముఖ బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ కూడా పెట్టుబడి పెట్టారు. ఈ సంస్థ 2022 ఫిబ్రవరి నాటికి రూ. 57 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.

చ‌ద‌వండి: సివిల్స్ టాప‌ర్‌గా ద‌ళిత అమ్మాయి... క‌ష్టాల‌ను ఎదుర్కొంటూ ప‌దిమందికి ఆద‌ర్శంగా నిలుస్తోందిలా..
స్విమ్మింగ్‌లో చాంపియన్‌

మేఘనా నారాయణ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ చాంపియన్. ఈ పోటీల్లో దాదాపు  400 పతకాలను గెలుచుకుంది. ఆసియా క్రీడలు సహా అనేక పోటీల్లో ఆమె పాల్గొని పతకాలు సాధించారు. ఒలింపిక్‌ క్రీడల్లో దేశానికి బంగారు పతకం సాధించాలనేది ఆమె కల. 
మేఘన విద్యాభ్యాసం సాగిందిలా...
మేఘన బెంగళూరు యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేశారు. ఆ తర్వాత 2002లో ఆక్స్‌ఫర్డ్‌లోని ఓరియల్ కాలేజీకి రోడ్స్ స్కాలర్‌గా కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదవడానికి వెళ్లారు. 2007లో ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.

Published date : 29 Mar 2023 01:28PM

Photo Stories