Inspirational Story: ఈమె కథ వింటే కన్నీళ్లు ఆగవు... రోడ్ల వెంట తిరుగుతూ సేల్స్ గర్ల్‌గా చేసింది... ఇప్పుడు కోటీశ్వరాలు అయ్యిందిలా...
300తో ఇంటి నుంచి బయటికి...
1981 అక్టోబర్ 10న రాజస్తాన్‌లో పుట్టిన చిను స్కూల్‌లో చదువుకుంటున్నపుడే కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లోంచి పారిపోయింది. ముంబైలోని సెయింట్ అలోసియస్ లో 10వ తరగతి చదువుతున్నపుడు.. దాదాపు 15 ఏళ్లకే పొట్టకూటికోసం రోడ్డుమీద పడింది. ఇంటి గడపదాటే నాటికి ఆమె వద్ద కేవలం రూ. 300, ఒక బట్టల బ్యాగ్ మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక ముంబైలోని రైల్వే స్టేషన్‌లో రెండు రోజులు పడుకుంది. ఒక మూల కూర్చుని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడే డోర్-టు-డోర్ సేల్ గురించి ఒక మహిళ ద్వారా తెలుసుకుని చివరికి సేల్స్‌గర్ల్ అవతార మెత్తింది. ఇంటింటికీ తీరుగుతూ వంటింటి కత్తుల, కోస్టర్ సెట్‌లను అమ్మడం స్టార్ట్‌చేసింది. అలా రోజుకు 20 రూపాయల సంపాదనతో కడుపు నింపుకునేది.
చదవండి: సివిల్స్ లో టాపర్... వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు
ఇప్పుడు ఆమె ఓ మోడల్....
వంద ఇళ్లు తిరిగితే ఒకటో రెండో వస్తువులు విక్రయించేది. అలా వచ్చిన డబ్బులతోనే పొట్ట నింపుకుంటూ, కనీస వసతులు లేని చోట నిద్రించేది. అలా కష్టపడుతూ ఏడెనిమిది నెలలకు సేల్స్ చేసే టీంకు లీడర్‌గా మారింది. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలింది. అలుపెరుగని జీవన పోరాటంలో పట్టు వదలక ఒక్కో మెట్టు ఎక్కుతూ రూ.40 కోట్ల టర్నోవర్ కంపెనీ రూబన్స్ యాక్సెసరీస్ యజమానిగా అవతరించింది. అంతేనా స్నేహితుల ప్రోత్సాహంతో 2007లో, గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా అందాల పోటీలకు ఎంపికైంది. అలా ఫ్యాషన్, ఆభరణాల ప్రపంచానికి పరిచయం అయింది.
దొరికిన ప్రతీ పని చేసుకుంటూ...
ఈ ప్రయాణంలో వెయిట్రెస్‌గా పనిచేయడంతోపాటు ఎన్నో రకాల పనులు చేసింది. అలా ముంబైలోని టాటా కమ్యూనికేషన్స్‌లో టెలీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం రావడం ఆమె జీవితంలో ఒక పెద్ద బ్రేక్. అక్కడే ఎంబీఏ గ్రాడ్యుయేట్ అమిత్ కలాతో పరిచయం.. అది ప్రేమగా మారడంతో 2004లో ఇద్దరు ఒక్కటయ్యారు.
చదవండి: ఆటల్లోనే కాదు, చదువులోనూ టాపరే.. సివిల్స్ ర్యాంకు కొట్టిన క్రికెటర్
చిను కలలకు రెక్కలిచ్చిన భర్త
భర్తగా,వ్యాపారవేత్తగా అమిత్ చినుకి కొండంతగా అండగా నిలిచాడు. నైపుణ్యాలను మెరుగుపరిచాడు. వ్యాపారవేత్త కావాలన్న ఆమె కలలకు రెక్కలిచ్చాడు. ఫలితంగా 2008లో కార్పోరేట్ మర్చండైజింగ్‌లో నైపుణ్య కంపెనీ ఫాంటే కార్పొరేట్ సొల్యూషన్స్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 2014లో బెంగళూరులో ఉన్న ఓ మాల్‌లోని చిన్న కియోస్క్ నుంచి రూబన్స్ యాక్సెసరీస్‌ను ప్రారంభించింది. 2021 నాటికి తన బ్రాండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లి పలువురి ప్రశంసలు అందుకుంది. తనలాంటి చాలామంది మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇపుటు కోట్ల టర్నోవర్‌తో సక్సెస్‌ఫుల్ బిజినెస్ విమెన్‌గా రాణిస్తోంది.
ఎప్పుడూ ముందుండాలి...
పోటీని జయించాలంటే.. ప్రత్యర్థులకంటే రెండు అడుగులు ముందుండటమే ఏకైక మార్గం అంటారు చిను. అందమైన డిజైన్లుతో ఏడాదికి కనీసం 10-12 కలెక్షన్‌లను తీసుకొస్తూ రూబన్స్ యాక్సెసరీస్ పాపులర్ అయిందని, మార్కెట్‌లో భారతీయ, పాశ్చాత్య డిజైన్‌లను కలిగి ఉన్న ఏకైక బ్రాండ్ మాదే అని ఆమె గర్వంగా చెబుతారు. రోజంతా తీరిక లేకుండా గడిపే చిను కనీసం 15 గంటల పాటు కష్టపడుతోంది. దేశీయ ఫ్యాషన్ జ్యువెలరీ మార్కెట్లో 25 శాతం వాటాను సాధించాలనేదే తన లక్ష్యమని గర్వంగా చెబుతోంది చిను.