Skip to main content

Inspiration Story: సివిల్స్ లో టాప‌ర్‌... వ్య‌క్తిగ‌త జీవితంలో ఇబ్బందులు ఎదురొచ్చినా ప‌దిమందికి ఆద‌ర్శంగా నిలుస్తోందిలా

అఖిల భార‌త సర్వీసుల్లో చేరాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ క‌ల‌లు కంటున్నారు. యూపీఎస్సీ ప‌రీక్ష‌ల్లో గెలుపొందిన వారిని స్ఫూర్తిగా తీసుకుని.. వారిలాగే తాము స‌క్సెస్ కావాల‌ని కష్ట‌ప‌డుతుంటారు. కానీ, ఆ ఇద్ద‌రు అమ్మాయిల‌కు వారి త‌ల్లే స్ఫూర్తిగా నిలిచింది. పిల్ల‌ల కోసం ఆ త‌ల్లి త్యాగం వ‌`థా కాలేదు. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఐఏఎస్‌లుగా మ‌లిచి సంపూర్ణ ఆనందాన్ని ఆస్వాదిస్తోంది ఆ తల్లి. ఆ వివ‌రాలు ఏంటో చూద్దాం....
IAS Tina Dabi
IAS Tina Dabi

టీనాదాబీ. 2016వ సంవ‌త్స‌రంలో ఏ పేరు మార్మోగిపోయింది. ఆ ఏడాది విడుద‌లైన యూపీఎస్సీ ఫ‌లితాల్లో టీనా టాప‌ర్‌గా నిలిచి, దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకుంది. మొద‌టిసారి ఓ ద‌ళిత‌మ్మాయి టాప‌ర్‌గా నిలిచింది. అప్ప‌టికి ఆమె వ‌య‌సు కేవలం 22 ఏళ్లే. ఆ త‌ర్వాత రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్‌కి క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తోంది. అక్క‌సాధించిన విజ‌యం చెల్లికి స్ఫూర్తిగా నిలిచింది. టీనా టాప‌ర్‌గా నిలిచిన‌నాటికి రియా హైస్కూల్‌లో చ‌దువుకునేది. ఎప్ప‌టికైనా అక్క‌లాగే తాను యూపీఎస్సీ ర్యాంక్ సాధించాల‌ని అప్పుడే నిర్ణ‌యించుకుంది. అలా రియా 2020లో సివిల్స్‌ సాధించింది. వీళ్లిద్దరినీ తీర్చిదిద్దిన గొప్పతనం మాత్రం తల్లి హిమానీ కాంబ్లేకే ద‌క్కుతుంది. ఇందుకోసం ఆమె తన కెరియర్‌నే వదులుకుంది.  

చ‌ద‌వండి: ఆట‌ల్లోనే కాదు, చ‌దువులోనూ టాప‌రే.. సివిల్స్ ర్యాంకు కొట్టిన క్రికెట‌ర్
తన కలని త్యాగం చేసి మీర‌....
టీనా, రియాలు చదువుల్లో చురుగ్గా ఉండటం చూసి తన కెరియర్‌నే త్యాగం చేశారు హిమానీ కాంబ్లే. భూపాల్‌లోని మౌలానా అజాద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ టాపర్‌ ఆమె. యూపీఎస్సీ రాసి ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌(ఐఈఎస్‌) ఆఫీసర్‌ అయ్యారు. ఉద్యోగం చేస్తూ కూడా పిల్లలను చదివించొచ్చు. కానీ వాళ్ల కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించాలనుకున్నారు. యూపీఎస్‌సీ కొట్టడం ఎంత కష్టమో త‌న‌ కంటే ఎక్కువగా ఎవరికి తెలుసు అనుకుంది ఆ త‌ల్లి. వెంట‌నే స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకుని... పిల్ల‌ల బాధ్య‌త‌ను భుజాన వేసుకుంది. 

IAS Teena Family


అబ్బాయిల‌కు అమ్మాయిలు ఎందులోనూ తీసిపోరు....
త‌ల్లిదండ్రులిద్ద‌రూ ఉద్యోగ‌స్తుల‌పై పిల్ల‌ల చ‌దువు పాడ‌వుతుంద‌ని ఆమె భావించింది. కుంటుంబానికి అండ‌గా భ‌ర్త ఎలాగూ బీఎస్ఎన్ఎల్‌లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా చేస్తున్నారు. ఇక తాను కూడా ఉద్యోగం చేయ‌డం ఎందుకని భావించ‌డంతోనే వీఆర్ఎస్ తీసుకున్న‌ట్లు చెబుతుంది హిమాని. ఆడపిల్లలు మగపిల్లలకన్నా తీసిపోరని భావించింది. ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవడమెలాగో పిల్ల‌ల‌కు అమ్మే నేర్పించింది. తనను తాను త్యాగం చేసుకొని పిల్ల‌ల్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆ అమ్మ ప‌దిమందికి ఆద‌ర్శంగా నిలుస్తోంది.  

చ‌ద‌వండి:​​​​​​​ క‌ర్ర‌ల‌తో ప్రాక్టీస్... క‌టింగ్ చేస్తూ ఎదిగాడు.. రాహుల్ ప్ర‌స్థానం సాగిందిలా​​​​​​​
సామాజిక మాధ్య‌మాల్లో ఫాలోయింగ్‌....

పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం ప్రధానాంశాలుగా సాగే అమృతసేన్‌ రచనలంటే టీనాకి చాలా ఇష్టం. ఆ పుస్తకాల ప్రభావంతోనే ప్రజాసేవలో అడుగుపెట్టానంటుంది టీనా. అక్క ప్రభావంతో ఐఏఎస్‌ అయిన రియా రాజస్థాన్‌ గ్రామాల్లో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. పిల్లల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న అధికారులని సస్పెండ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో లక్షలమంది అభిమానులని సంపాదించుకుంది. ఇద్ద‌రు అక్క‌చెల్లెళ్ల‌కు దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్య‌మాల‌లో ల‌క్ష‌ల్లో ఫాలోయింగ్ ఉంది. టీనా, రియాల‌ను స్ఫూర్తిగా తీసుకుని ఐఏఎస్ ల‌క్ష్యం సాధించిన వారు వంద‌ల్లో ఉన్నారు.

Published date : 18 Mar 2023 01:33PM

Photo Stories