Collector Transfer: క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్‌గా శరయు..
Sakshi Education
బదిలీలు పొందిన కలెక్టర్లలో ఒకరు శరయు.. ఆమె క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలను చేపట్టారు.
Collector Sarayu transfers to Krishnagiri district
క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్‌గా సోమవారం శరయు బాధ్యతలను స్వీకరించారు. గత 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 16 మంది జిల్లా కలెక్టర్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది.
క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్ దీపక్ జేకప్‌ను తంజావూరు కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఆ స్థానంలో తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సంఘ డిప్యూటీ డైరెక్టర్ కే.ఎం.శరయును నియమించారు. కలెక్టర్ శరయు సోమవారం క్రిష్ణగిరి కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు.