Skip to main content

Medical College: వైద్య విద్యార్థుల‌కు ప్రొఫెస‌ర్ ప్ర‌శంస‌లు

వైఎస్ఆర్ యూనివ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌కు సంద‌ర్శించారు. అక్క‌డి ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించారు. విద్యార్థుల‌ను, ఉపాధ్యాయుల‌ను అభినందించారు. క‌ళాశాల గురించి మాట్లాడుతూ అంద‌రినీ ప్రోత్సాహించారు..
Health University Vice chancellor Baabji
Health University Vice chancellor Baabji

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రంలో కార్పొరేట్‌కు దీటుగా అద్భుతమైన రీతిలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సంకల్పాన్ని నిజం చేసి చూపించారని వైఎస్సార్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ బాబ్జీ అన్నారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలను ఆయన సందర్శించారు. వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు, ల్యాబ్స్‌, లెక్చర్‌ హాల్స్‌ పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.

Students at G20 Competitions: దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించే జి20 పోటీల్లో ఈ విద్యార్థులు ఎంపిక‌

ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, వైద్య విద్య అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైస్‌ చాన్స్‌లర్‌ బాబ్జిని ఘనంగా సత్కరించారు. కళాశాలలో పరిస్థితులను ఆయనకు వివరించారు. వైద్య విద్యార్థులను ఉద్దేశించి బాబ్జి మాట్లాడుతూ.. ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలోని వైద్య విద్యార్థులంతా అత్యుత్తమ స్థాయి ప్రతిభను చాటుకుంటూ రాష్ట్రంలోనే ఉత్తమ కళాశాలగా పేరు తెచ్చుకోవాలని చెప్పారు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం మాటలను గుర్తు చేస్తూ వైద్య విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటి సాధనకు క్రమశిక్షణతో కృషి చేయాలని తెలిపారు.

Mini Job Mela: నిరుద్యోగుల‌కు జాబ్ మేళా

వైద్య విద్య అభ్యసించేవారు 99 శాతం తమ కోర్సును పూర్తి చేసుకుని పట్టాతో బయటకు వెళతారని చెప్పారు. వైద్య విద్యలో నాలుగుసార్లు ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశం ఉంటుందనీ, విద్యార్థులు కష్టపడి కోర్సును పూర్తి చేయాలని చెప్పారు. కొందరు స్పెషలిస్ట్‌ వైద్యులుగా తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటూ ఉత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు.

Published date : 05 Oct 2023 03:50PM

Photo Stories