Medical Seats: పలు విభాగాల్లో మెడికల్ సీట్ల కేటాయింపు
Sakshi Education
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పలు విభాగాల్లో 60 పీజీ సీట్లను కేటాయించాలని వైద్యశాఖాదికారులు కోరారు. ఈ కారణంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ప్రధాన సీట్ల విభాగాల గురించి తెలిపారు.
సాక్షి ఎడ్యుకేషన్: నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించి వివిధ విభాగాల్లో 60 పీజీ సీట్లు కేటాయించాలని మెడికల్ కళాశాల అధికారులు వైద్యశాఖ ఉన్నతాధికారులను కోరారు. శుక్రవారం వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలను పంపారు.
Employment Offer: యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న కంపెనీ...
ఈ సందర్బంగా వైద్యశాల సూపరింటెండెంట్ నరేంద్ర మాట్లాడుతూ ప్రధానంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్ విభాగాలకు పీజీ సీట్లు కావాలని తెలిపినట్లు వివరించారు. త్వరలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం కళాశాలను సందర్శించిన తరువాత సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.
Published date : 19 Sep 2023 10:41AM