Employment Offer: యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న కంపెనీ...

సాక్షి ఎడ్యుకేషన్: వైఎస్సార్, నెల్లూరు జిల్లాల సరిహద్దులో బద్వేల్ సమీపంలోని సెంచూరియన్ ప్లై ఉడ్ కంపెనీలో ఆత్మకూరు నియోజకవర్గంలోని సుమారు 500 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఆ కంపెనీని సందర్శించారు. దాని ప్రెసిడెంట్ హిమాన్షుషా, సిబ్బందితో సమావేశమై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Government Scholarship Scheme: విద్యార్థుల ప్రతిభకు ఎన్ఎంఎంఎస్ పథకం
త్వరలో ప్రారంభం కానున్న ఈ సంస్థ ద్వారా వందలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. దీంతోపాటు కంపెనీకి కావాల్సిన రా మెటీరియల్, సుబాబుల్, జామాయిల్ రైతుల వద్ద కొనుగోలు చేసి తద్వారా వారిని ఆర్థికంగా ప్రోత్సహించనున్నట్లు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో విక్రమ్‌రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. వారికి కావాల్సిన నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు.
Gurukul Students for Wrestling: జిల్లా స్థాయి రెజ్లింగ్ కోసం ఎంపికైన గురుకుల విద్యార్థులు
ముఖ్యంగా సెంచురియన్ ఫ్యాక్టరీ వారికి కావాల్సిన ముడిసరుకును అందించేందుకు ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల మెట్ట ప్రాంత రైతులను ప్రోత్సహించేలా సుబాబుల్, జామాయిల్, తదితర పంటలను విస్తారంగా సాగు చేసేలా అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యే కోరారు. కంపెనీ వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.