Gurukul Students for Wrestling: జిల్లా స్థాయి రెజ్లింగ్ కోసం ఎంపికైన గురుకుల విద్యార్థులు
సాక్షి ఎడ్యుకేషన్: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ఆవరణలో ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17 జిల్లాస్థాయి రెజ్లింగ్ ఎంపికలు శుక్రవారం జరిగాయి. బాల బాలికలకు విడివిడిగా ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 8 పాఠశాలలకు చెందిన సుమారు 150మంది క్రీడాకారులు హాజరయ్యారు.
APSCSCL Recruitment 2023: ఏపీ సివిల్ సప్లైస్, ఎన్టీఆర్ జిల్లాలో 507 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
● అండర్–14 ఫ్రీస్టైల్ 35 కిలోల బాలుర విభాగంలో అచ్చంపేట గురుకుల కళాశాలకు చెందిన పి.నాగచైతన్య, 38 కిలోల విభాగంలో ఎన్.బాబు, 41కిలో విభాగంలో బి.ఓబిడు, 44 కిలోల విభాగంలో సీహెచ్ ఎర్రబాబు, 52కిలోలలో విభాగంలో అడవితక్కెళ్లపాడుకు చెందిన కె.ప్రతాప్, 57కిలోలలో సత్తెనపల్లికి చెందిన కె.విజయరాజు, 68కిలోలలో అచ్చంపేటకు చెందిన సీహెచ్ రాంబాబు, 75కిలోలలో జి.రాజులు ఎంపికయ్యారు.
● అండర్ 17 బాలుర విభాగంలో 45కిలోలు అచ్చంపేట గురుకుల పాఠశాలకు చెందిన వి.పృధ్వీ, 48కిలోలు ఎం శివాజి, 51కిలోలలో బి.సంతోష్, 55కిలోలలో కె.కుమార్‌బాబు, 60కిలోలలో టి.మధు, 65కిలోలలో బి.విజయ్‌బాబు, 71కిలోలలో సత్తెనపల్లికి చెందిన ఎం.ప్రవీణ్, 80కిలోలలో అడవితక్కెళ్లపాడుకు చెందిన టి.పవన్ కళ్యాణ్, 92కిలోలలో ఎస్.భవానీప్రసాద్ ఎంపికయ్యారు.
TET Exam: టెట్ పరీక్ష ప్రశాంతం.. ఇంత మంది హాజరు
గ్రీకో రోమన్ విభాగంలో అచ్చంపేటకు చెందిన కె.కార్తికేయ, ఎస్.వంశీకుమార్, ఎం.జాయ్, పి.చంటి, బి.మహేంద్ర, బి.కళ్యాణ్, నరసరావుపేటకు చెందిన ఒ.నాగబ్రహ్మయ్య, అడవితక్కెళ్లపాడుకు చెందిన పి.జయకుమార్ తదితరులు ఎంపికయ్యారు.
● అండర్–14 బాలికల విభాగంలో బాపట్లకు చెందిన ఎం.నిస్సీ, కె.శ్రీజ, వి.అనూష, టి.ఐశ్వర్య, జి.అమూల్య, టి.మహి, అమరావతికి చెందిన కె.దీవెన, పూజమల్లేశ్వరి, విజయపురిసౌత్‌కు చెందిన వి.శివన్య, బి.కీర్తి తదితరులు ఎంపికయ్యారు.
● అండర్–17 బాలికల విభాగంలో బాపట్లకు చెందిన సీహెచ్ రోశిలిని, కె.రోజా, డి.ప్రిన్సి, విజయపురిసౌత్‌కు చెందిన ఆర్ గాయత్రిభాయ్, పి.జ్యోతి, ఎం.మెర్సిరోజ్, నరసరావుపేటకు చెందిన ఎం.నాగరత్నకుమారి, అమరావతికి చెందిన ఎం.సుధ తదితరులు ఎంపికయ్యారు.
UPSC Youngman Success: సివిల్స్ పై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామ
పోటీలను స్థానిక ఏపీ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ టి.అరుణ్‌కుమార్ ప్రారంభించారు. వివిధ పాఠశాలలో కోచ్ కె.మనోహర్, ఫిజికల్ డైరెక్టర్స్ కోటేశ్వరి, మెహబూబి, సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. స్థానిక ఫిజికల్ డైరెక్టర్ జి.భూషణం రిఫరీగా వ్యవహరించారు. ఎంపికై న విద్యార్థులంతా ఈనెల 21, 22, 23 తేదీలలో కృష్ణాజిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికలలో పాల్గొంటారు.