Skip to main content

UPSC Youngman Success: సివిల్స్ పై ఆస‌క్తితో ఉద్యోగానికి రాజీనామ‌

చిన్న‌త‌నంలోనే చ‌దువులో ముందు స్థానంలో ఉన్న ఈ యువకుడు, బీటెక్ చ‌దువును ముంబాయిలో పూర్తి చేసి, కేంద్ర‌ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని సాధించాడు. కానీ, సివిల్స్ పై ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామ చేసి సివిల్స్ లో ఉత్తీర్ణ‌త‌ను జ‌యించాడు. ఈ యువ‌కుడి ప్ర‌యాణం తెలుసుకుందాం.
UPSC Civils 2022 ranker Bhargav
UPSC Civils 2022 ranker Bhargav

సివిల్స్‌ ఫలితాల్లో గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన యువకుడు పొటుపురెడ్డి భార్గవ్ 772 ర్యాంకు సాధించి ప్రతిభ చూపాడు. ఐఆర్‌ఎస్ గాని ఐఎఫ్‌ఎస్‌ గాని వచ్చే అవకాశం ఉంది. తండ్రి సత్తిబాబు విజయనగరం ఆర్టీసీలో సెక్యూరిటీ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్నారు. తల్లి పద్మావతి గృహిణి.

Civils Ranker: డ్రైవ‌ర్ కొడుకు విజ‌యం త‌ల్లికి గ‌ర్వం

భార్గవ్‌ చిన్నప్పటి నుంచి చదవులో ముందుండేవాడు. కష్టపడి చదివేవాడు. 1 నుంచి 10వ తరగతి వరకు విజయనగరంలోని భాష్యం స్కూల్‌లోను, ఇంటర్మీయడిట్‌ విశాఖపట్నంలోని చైతన్య కళాశాలలో చదివాడు. బీటెక్‌ విద్యను ముంబాయి ఐఐటీలో పూర్తి చేశాడు.

అనంతరం కేంద్రప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఆరు నెలల పాటు పనిచేశాడు. అనంతరం సివిల్స్‌ పై ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఇప్పటివరకు నాలుగు సార్లు రాశాడు. ఐదో ప్రయత్నంలో 772 ర్యాంకు సాధించాడు.

Success Story: హైఫై లైఫ్‌ కాదనుకుని... ఐఎఫ్‌ఎస్‌కు

ఐఏఎస్‌ కావాలన్నదే లక్ష్యం

ఐఏఎస్‌ సాధించాలన్నదే నా లక్ష్యం. దీనికోసం కష్టపడి చదివాను. ప్రస్తుతం 772వ ర్యాంకు వచ్చింది. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌)గాని, ఇండియన్‌ ఫారెస్టు సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)గాని వచ్చే అవకాశం ఉంది.

- పొటుపు రెడ్డి భార్గవ్‌, పెదవేమలి,
  గంట్యాడ మండలం

Published date : 17 Sep 2023 10:06AM

Photo Stories