YVU Degree Honors: డిగ్రీ హానర్స్ ను ప్రారంభించనున్న వైవీ యూనివర్సిటీ
సాక్షి ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయంలో 2023–24 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ హానర్స్ ప్రారంభిస్తున్నట్లు వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ తెలిపారు. బుధవారం ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో వైవీయూ వీసీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యేడాది నుంచి డిగ్రీ మూడో సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు నాల్గవ యేడాది డిగ్రీ హానర్స్ చేసేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
Skill Training: స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ లో శిక్షణకు దరఖాస్తులు
డిగ్రీ హానర్స్ పూర్తి చేసుకునే విద్యార్థులు నేరుగా పీజీ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చన్నారు. అదే విధంగా రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పీహెచ్‌డీలో సైతం ప్రవేశం పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి, ప్రవేశాల సంచాలకులు ఆచార్య కె. గంగయ్య, సీడీసీ డీన్ ఆచార్య రఘుబాబు, డిప్యూటీ డైరెక్టర్ టి. లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.