Skip to main content

Skill Training: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్ లో శిక్ష‌ణకు ద‌ర‌ఖాస్తులు

అర్హ‌త‌, ఆస‌క్తి గ‌ల‌వారు నైపుణ్య శిక్ష‌ణ కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్ లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఇన్‌స్టిట్యూట్ సీనియర్‌ మేనేజర్ కోర్సుల వివ‌రాల‌ను కూడా తెలిపారు.
Skill Training for interested candidates at Institute
Skill Training for interested candidates at Institute

సాక్షి ఎడ్యుకేష‌న్: నైపుణ్య శిక్షణ కోసం హెచ్‌పీసీఎల్‌ నిర్వహిస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌డీఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తునట్టు ఎస్‌డీఐ సీనియర్‌ మేనేజర్‌ పల్లి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండ్రస్ట్రియల్‌ వెల్డర్‌, పైప్‌ ఫిట్టర్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, ఫ్యాబ్రికేషన్‌, ఆర్క్‌ వెల్డింగ్‌, రిటైల్‌ సేల్స్‌ అసోసియేట్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను కోరారు.

Inspire Manak Program: బైసైకిల్ అంబులెన్స్ ను రూపొందించిన విద్యార్థి

శిక్షణ కాలంలో అభ్యర్థులకు హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ వరకు చదువుకున్న 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులని, అభ్యర్థులు 781336432, 9652871144లో సంప్రదించాలని సూచించారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Published date : 12 Oct 2023 04:32PM

Photo Stories