Skip to main content

School Inspection : ఉన్న‌త పాఠ‌శాల‌లో క‌లెక్ట‌ర్ త‌నిఖీ.. విద్యార్థుల‌తో ఈ విష‌యాల‌పై చ‌ర్చ!

Collector inspects the school and interact with students  Inspection of Srivenugopala High School by Collector Chadalavada Nagarani

పెనుమంట్ర: పాలిటెక్నిక్‌ విద్య అభ్యసించడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవచ్చని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం నెగ్గిపూడి(మార్టేరు)లోని శ్రీవేణుగోపాల ఉన్నత పాఠశాలను సందర్శించి తనిఖీ చేసారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల పక్కనే ప్రఖ్యాతి గాంచిన వ్యవసాయ పరిశోధనా సంస్థ ఉన్న విషయం ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు.

Job Mela : ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో జాబ్ మేళా.. ఎప్పుడు!

పాలిటెక్నిక్‌ వ్యవసాయ కోర్సులలో ప్రవేశించి మట్టితో మమేకం కావడం ద్వారా రైతులకు సేవలు అందిస్తూ దేశంలో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. విద్యార్ధులు పదో తరగతి అనంతరం ఏఏ కోర్సులను అభ్యసించాలన్నదానిపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు క్రీడా స్పూర్తితో ఆటలపై దృష్టిసారించాలన్నారు. బాల్యం నుంచి ఉన్నతంగా చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్‌ను సొంతం చేసుకోవడానికి తోటి విద్యార్థులతో పోటీ పడాలన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Oct 2024 03:48PM

Photo Stories