Skip to main content

Show Cause Notice: జూనియ‌ర్ లెక్చ‌రర్ల‌కు షోకాజ్ నోటీసులు..

లెక్చ‌ర‌ర్లు మూల్యాంక‌న స‌మ‌యంలో జ‌రిపిన తప్పుల‌ను గ‌మ‌నించిన అధికారులు వారికి షోకాజ్ నోటీసుల‌ను జారీ చేశారు. ఈ నోటీసుల గురించి వివ‌రిస్తూనే ఎంత‌మందికి నోటీసుల‌ను జారీ అయిందో కూడా వెల్ల‌డించారు..
Issue of Show Cause Notice for junior lecturers
Issue of Show Cause Notice for junior lecturers

సాక్షి ఎడ్యుకేషన్‌: గత మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు చేసిన పలువురు జూనియర్‌ లెక్చరర్లకు ఇంటర్‌ బోర్డు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు చెందిన 41 మందికి ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాల ద్వారా తాఖీదులు పంపినట్టు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రాయల సత్యనారాయణ తెలిపారు.

➤   Job Mela at University: శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ విశ్వ‌విద్యాల‌యాల్లో జాబ్ మేళా మొద‌లు..

మూల్యాంకన సమయంలో వారు ఏయే తప్పులు చేశారో నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ మంది శ్రీచైతన్య, నారాయణ కళాశాలలకు చెందిన వారే ఉండడం గమనార్హం. వారం రోజుల్లోగా షోకాజ్‌ నోటీసులకు వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో సంబంధిత అధ్యాపకులకు జరిమానా విధించడంతో పాటు ఏపీ పబ్లిక్‌ పరీక్షల చట్టం సెక్షన్‌ 10 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు నోటీసుల్లో తెలిపారు.

Published date : 31 Oct 2023 11:37AM

Photo Stories