Autonomous Colleges: కాలేజీలకు స్వయం ఉత్పత్తి పత్రాలు
సాక్షి ఎడ్యుకేషన్: జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న కొన్ని కళాశాలలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదాను, శాశ్వత గుర్తింపును యూనివర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ కె.వెంకటసుబ్బయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమలు ఆయా కళాశాలకు గుర్తింపు పత్రాలను అందజేశారు.
☛ Chess Competitions: ఇన్‌స్పైరో పాఠశాలలో చదరంగం పోటీలు
అనుబంధ కళాశాలల్లోని డాడీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అనకాపల్లి), విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ (దువ్వాడ) కళాశాలల ప్రతినిధులకు యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ధ్రువీకరణ పత్రాలను ఇచ్చారు. అదేవిధంగా మిరాకిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (భోగాపురం), విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ (దువ్వాడ) కళాశాలలకు మూడు సంవత్సరాల శాశ్వత ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అకడమిక్ అండ్ ఆడిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, కళాశాలల ప్రిన్సిపాల్స్ పలువురు పాల్గొన్నారు.