NMMS Exam : 8వ తరగతి విద్యార్థులకు ఈనెల 8న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష..
అనంతపురం: 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) ఈనెల 8న ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 3,665 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.
Course Selection : డిగ్రీ పీజీ విద్యార్థులకు శుభవార్త.. ఇకపై సబ్జెక్టు ఎంపికలో..
ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. హాల్‌టికెట్లు www.bre.ap. gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారని తెలిపారు. సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలు పాఠశాల యూడైస్ కోడ్ ద్వారా లాగిన్ అయి వారివారి విద్యార్థుల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇంకా 251 మంది విద్యార్థుల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేయలేదన్నారు. హెచ్‌ఎంలు చొరవ తీసుకుని ప్రతి విద్యార్థికీ హాల్‌టికెట్ అందజేసి పరీక్షకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- NMMS Scholarship
- Eighth class students
- higher education
- National Means Cum Merit Scholarship
- students talent
- NMMS Hall ticket download
- december 8th
- students education
- higher and quality education
- Education News
- Sakshi Education News
- NMMS Scholarship exam updates
- NationalMeritScholarship
- EducationalAnnouncements
- ScholarshipExams
- NMMS2024