Chess Competitions: ఇన్‌స్పైరో పాఠశాలలో చదరంగం పోటీలు
సాక్షి ఎడ్యుకేషన్: విజయనగరం మండలంలోని ముడిదాంలో అండర్–13 రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముడిదాం గ్రామ సమీపంలో ఉన్న ఇన్‌స్పైరో పాఠశాలలో ఆలిండియా చెస్ ఫెడరేషన్, ఆంధ్ర చెస్ ఫెడరేషన్ మార్గదర్శకంలో ఇంటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఇన్‌స్పైరో స్కూల్, రోటరీ క్లబ్ ఫోర్ట్, జిల్లా చెస్ అసొసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి సుమారు 170 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Intermediate Board: ప్రైవేటు కాలేజీలకు హెచ్చరిక
మూడు రోజుల పాటు నిర్వహించే పోటీలకు హాజరైన చిన్నారులతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు ఇన్‌స్పైరో పాఠశాలలో వసతి ఏర్పాటు చేసినట్లు విజయనగరం చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఏ రావు, కార్యదర్శి కేవీ జ్వాలాముఖిలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి భీమారావు, ఇన్‌స్పైరో పాఠశాల డైరెక్టర్ రవి కె.మండా, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ రాగసుధ, రోటరీ క్లబ్ ఫోర్ట్ సభ్యులు శ్రీతిదేవ్, రికి.ఎం, తదితరులు పాల్గొన్నారు.