Minister Gummanur Jayaram: హాలహర్వికి జూనియర్ కళాశాల
ఆలూరు నియోజకవర్గంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలో జింకలు పార్కు ఏర్పాటు, రో డ్ల నిర్మానం, ప్రభుత్వ వసతి గృహాల ఏర్పాటు, జలవనరుల ప్రాజెక్టులు, నీటి పథకాల నిర్వహణ, కొత్త పథకాల మంజూరుపై సమావేశంలో మంత్రి చర్చించారు. ఆలూరులో షాపింగ్ కాంప్లెక్స్, సంతమార్కెట్, వంతెన నిర్మాణం చేపడతామని చెప్పారు. హొళగుంద బస్టాండు నుంచి ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వరకు సీసీ రోడ్డు నిర్మించడం, ఆలూరులో 30 పడకల ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా మార్చడం, హాలహర్వికి జూనియర్ కళాశాల, అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
AP Govt: క్రిస్ సిటీ తొలి దశలో 78,900 మందికి ఉపాధి
మరో ఏడాదిలో మెడికల్ కాలేజీ పూర్తి
ఆదోని నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చేస్తామని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. రోడ్ల నిర్మాణం, సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ మరమ్మతులకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఆదోనికి మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అధ్యాపకులను నియమించాలని కోరారు. మైనార్టీ ఐటీఐ కళాశాల, మహిళా జూనియర్ కాలేజీ, ఆటోనగర్ వంటి సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఆదోనిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు మరో ఏడాదిలో పూర్తవుతాయన్నారు. ఆదోని ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదోని ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారన్నారు.