SERP: ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు
వచ్చేనెల నుంచి వీరి జీతాలు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. కొంత కాలంగా జీతాలు పెంచాలని సెర్ప్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జీతాలు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సీఎం జగన్ చిత్రపటానికి ఉద్యోగులు క్షీరాభిషేకాలు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Also read: Orientation Programme: కామర్స్, బీబీఏ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
బేసిక్‌పై 23 శాతం వరకు..
సెర్ప్ ఉద్యోగులకు బేసిక్ వేతనంపై 23 శాతం జీతం పెంచారు. జీతం పెంచడం జరిగింది. సెర్ప్‌లో క మ్యూనిటీ కో–ఆర్డినేటర్ (సీసీ), అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం), డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్ (డీపీఎం), అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్స్ (ఏఏ) ఉద్యోగులు పనిచేస్తున్నారు. సీసీల జీతం రూ.25 వేల నుంచి రూ.40 వేలు ఉండగా వారికి రూ.5,750 నుంచి రూ.9,200 వరకు, ఏపీఎంలకు జీతం రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఉండగా వారికి రూ.9,200 నుంచి రూ.11,500 వరకు, డీపీఎంలకు జీతం రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఉండగా వారికి రూ.13,800 నుంచి రూ.16,100 వరకు, ఏఏలకు 5 వేల నుంచి 7 వేల వరకు జీతం పెరిగింది.
Also read: Government ITI college: ప్రభుత్వ ఐటీఐలో నూతన కోర్సు
పథకాల అమలులో కీలకంగా..
ఉమ్మడి జిల్లాలో సెర్ప్‌లో 269 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో పశ్చిమగోదావరి జిల్లాలో 85 మంది, ఏలూరు జిల్లాలో 184 మంది విధులు నిర్వహిస్తున్నారు. డ్వాక్రా గ్రూపుల అభివృద్ధి, వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డ్డీ, జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, జగనన్న పాల వెల్లువ, ఉన్నతి వంటి పథకాలను మహిళలకు పారదర్శంగా అందించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. డ్వాక్రా గ్రూపులకు బ్యాంకు రుణాల మంజూరు, స్వయం ఉపాధి, చిరు వ్యాపారాలకు తోడ్పాటు అందిస్తున్నారు.
Also read: DOST 2023: సెప్టెంబర్ 5 వరకు స్పెషల్ డ్రైవ్ ఫేజ్ అడ్మిషన్లు
ఉద్యోగి పశ్చిమగోదావరి ఏలూరు
- డీపీఎం 4 7
- ఏపీఎం 15 31
- సీసీ 60 125
- ఏఏ 6 21
- మొత్తం 85 184
- సెర్ప్ ఉద్యోగులు
- 23 శాతం పెరిగిన జీతం
- కేడర్‌ను బట్టి రూ.5 వేల నుంచిరూ.16 వేల వరకు పెంపుదల
- ఉమ్మడి జిల్లాలో 269 మంది ఉద్యోగులు
- సర్వత్రా హర్షాతిరేకాలు
Also read: Means-cum-Merit Scholarship : స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
నాకు రూ.6,210 పెరిగింది
నాకు రూ.6,210 జీతం పెరిగింది. జీతాల పెరుగుతాయని ఎదురుచూస్తున్న మాకు సీఎం సార్ తీసుకున్న నిర్ణయం సంతోషం కలిగించింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో మరింత బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం.
– టి.కాంతారావు, సీసీ, ఆకివీడు మండలం
Also read: Teachers: ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు
సెప్టెంబర్ నుంచి అమలులోకి..
సెర్ప్ ఉద్యోగులకు బేసిక్‌పై 23 శాతం జీతం పెంచడం హర్షణీయం. పశ్చిమగోదావరి డీఆర్ డీఏ పరిధిలో 85 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి కేడర్‌ను బట్టి రూ.5 వేల నుంచి రూ.16 వేల వరకు జీతాలు పెరిగాయి. వచ్చే నెలలో పెరిగిన జీతాలను ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది.
– ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, డీఆర్‌డీఏ పీడీ, భీమవరం
Also read: Jagananna Vidya Devena Scheme: 13,578 మందికి జగనన్న విద్యాదీవెన
చాలా సంతోషం
సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వం 23 శాతం జీతాలు పెంచడం సంతోషం. జీతాలు పెంచాలని కొంత కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా గురించి ఆలోచన చేసిన సీఎం జగన్ సార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రభుత్వం జీతాలు పెంచడం ద్వారా సీసీలు, ఏపీఎంలు, డీపీఎంలు, ఏఏలకు మేలు జరుగుతుంది.
– సీహెచ్ రాజేష్, ఏపీఎం, గణపవరం మండలం
Also read: Ekalavya schools: విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి