Skip to main content

Teachers: ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు

ఆదిలాబాద్‌టౌన్‌: టీచర్ల అక్రమ డిప్యూటేషన్లపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు డీఈవో ప్రణీత ఎట్టకేలకు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన నలుగురి డిప్యూటేషన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు
ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు

‘మేమింతే.. మారమంతే..’ ‘నచ్చినట్లు సర్దుబాటు’ శీర్షికన ‘సాక్షి’లో ఇటీవల పలు కథనాలు ప్రచురితం అయ్యాయి. ఈ క్రమంలో స్పందించిన డీఈవో.. స్పోర్ట్స్‌ స్కూల్‌లో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ రద్దు చేసినట్లు వెల్లడించారు.

Also read:DSP Jobs కొట్టామిలా.. | మా శిక్ష‌ణ ఎలా ఉంటుందంటే..? | DSP Success Stories in Telugu | APPSC Group 1

గుడిహత్నూర్‌ మండలం మన్నూర్‌ జెడ్పీఎస్‌ఎస్‌లో పనిచేస్తున్న సవితదేవి, తలమడుగు జెడ్పీఎస్‌ఎస్‌లో పనిచేస్తున్న ఏ.మురళి, అలాగే రణదీవెనగర్‌లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న టి.శోభారాణి, గాదిగూడ మండలం లోకారిలో పనిచేస్తున్న సీహెచ్‌ రజినీల డిప్యూటేషన్లను రద్దు చేశారు. వెంటనే వీరిని రిలీవ్‌ చేయాలని మండల విద్యాధికారులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అలాగే మరికొంత మంది ఓరల్‌ డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారని, వారివి సైతం రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

Also read: 

CM Jagan Good News: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల #sakshieducation

126 views1 month ago

Published date : 29 Aug 2023 06:13PM

Photo Stories