Skip to main content

Students School : తాత్కాలిక షెడ్డులో విద్యార్థులకు పాఠాలు..

Education for students in a temporary shed

అనంతగిరి: మండలంలోని కివర్ల పంచాయతీ తంగేళ్లబంధ గ్రామంలో తాత్కాలిక షెడ్డు నిర్మించుకున్నాం.. ఒక ఉపాధ్యాయుడిని నియమించి, తమ పిల్లలకు చదువు చెప్పించడయ్యా అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. వర్షాకాలం కావడంతో గ్రామ సమీపంలోని గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో గ్రామం నుంచి గంగవరం పాఠశాలకు విద్యార్థులు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా షెడ్డు నిర్మించుకున్నాం, ఉపాధ్యాయుడిని నియమించాలని గత నెలలో అధికారులను కోరారు. అయితే షెడ్డు నిర్మించి వారం గడుస్తుందని, చర్యలు తీసుకోవా లని ఆదివారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేతులు జోడించి వినూత్నంగా వేడుకున్నారు.

Hydrogen Cruise: భారతదేశంలోనే తొలి హైడ్రోజన్‌ క్రూయిజ్‌.. ఎక్కడంటే..

Published date : 15 Jul 2024 03:04PM

Photo Stories