Skip to main content

Ekalavya schools: విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి

అరకులోయ రూరల్‌: విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు.
ఏకలవ్య పాఠశాలల రాష్ట్రస్థాయి సాంస్కృతిక సంబరాలు
ఏకలవ్య పాఠశాలల రాష్ట్రస్థాయి సాంస్కృతిక సంబరాలు

యండపల్లివలస ఏకలవ్య పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఏకలవ్యపాఠశాలల రాష్ట్రస్థాయి సాంస్కృతిక సంబరాలు సోమవారంతో ముగిశాయి. ముగింపు ఉత్సవాల్లో అరకు,పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ,కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,జెడ్పీచైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గుణ మాట్లాడుతూ బంగారు భవిష్యత్తుకోసం యువత కృషి చేయాలని తెలిపారు.

Also read: తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు : CM YS Jagan

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అన్నిరంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. విద్యార్థులకు అన్ని రంగాలపై అవగాహన ఉండలన్నారు.జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ విద్యా,వైద్య రంగాలకు రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలతో యువత మరింతగా రాణించాలన్నారు. సాంస్కృతి సంబరాల్లో డ్యాన్స్‌,సంగీతం,థింసా,పెయింటింగ్‌, వివిధ ప్రదర్శనల పోటీలు నిర్వహించారు. గ్రూప్‌ సాంగ్‌ పోటీల్లో మారేడుమిల్లి బాలికలకు మొదటి స్థానం,చింతపల్లి విద్యార్థులకు రెండో స్థానం లభించింది.

Also read: AP Students Chosen for United Nations Forum Meet | CM YS Jagan | #sakshieducation

గ్రూప్‌ డ్యాన్స్‌లో అరకులోయ ఏకలవ్య పాఠశాలకు మొదటి స్థానం, జీకే వీధి పాఠశాలకు రెండో స్థానం,సోలో సాంగ్‌ పోటీల్లో అనంతగిరికి మొదటి స్థానం,మారేడిమిల్లి రెండో స్థానం లభించాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురుకులాల జాయింట్‌ సెక్రెటరీ రమణమూర్తి,జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గాసి,కోఆప్షన్‌ సభ్యుడు రహీంతుల్లా, వివిధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు మూర్తి,భాస్కర్‌,ప్రభాకర్‌, సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు

Also read: Nadu Nedu: Revolutionizing AP Govt Schools with AI Technology #sakshieducation

Published date : 29 Aug 2023 05:58PM

Photo Stories