Skip to main content

DOST 2023: సెప్టెంబర్‌ 5 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌ అడ్మిషన్లు

కరీంనగర్‌ సిటీ: డిగ్రీ కళాశాలల్లో సెప్టెంబర్‌ 5 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌ అడ్మిషన్లకు అవకాశం ఉందని ఎస్సారార్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రి న్సిపాల్‌ కె.రామకృష్ణ, ‘దోస్త్‌’ సమన్వయకర్త ఎ.శ్రీనివాస్‌ తెలిపారు.
5 వరకు డిగ్రీ స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌ అడ్మిషన్లు
5 వరకు డిగ్రీ స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌ అడ్మిషన్లు

ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు దోస్త్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నా రు. ఎస్సారార్‌ అటానమస్‌ కళాశాలలో 1,680 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందులో బీఏ ఇంగ్లిష్‌ 2, బీఏ తెలుగు 9, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ 10, బీబీఏ 12, బీబీఏ రిటైల్‌ 12, బీకాం బిజినెస్‌ అనలైటిక్స్‌ 12, బీఎస్సీ లైఫ్‌ సై న్స్‌ 27, బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌లో 58 సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

Also read: AP Third Place in Training & Employment to Rural Youth @SakshiBhavita

ఈ కళాశాలలో ఈ ఏడాది నుంచే స్వయం ప్రతిపత్తి హోదా అడ్మిషన్లు జరుగుతున్నాయని అన్నారు. న్యాక్‌–ఎ గ్రేడ్‌ గుర్తింపు వచ్చిందని, అన్ని సదుపాయాలు గల లాబ్స్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, లైబ్రరీ, టీఎస్‌కేసీ, బాలికలకు హాస్టల్‌ వసతి, విశాలమైన క్రీడా ప్రాంగణం ఉన్నాయని, అనుభవజ్ఞులైన లెక్చరర్లతో విద్యాబోధన జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, ఉజ్వల భవిష్యత్తు పొందాలన్నారు. కళాశాలలో దోస్త్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ సదుపాయం ఉందని, ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో ఏదైనా సమస్య ఎదురైతే సంప్రదించాలని సూచించారు.

Also read: CM Jagan Good News: Benefits for AP MBBS Aspirants | 100% Seats #sakshieducation

Published date : 29 Aug 2023 06:38PM

Photo Stories