Skip to main content

Degree Admissions: డిగ్రీలో ప్రవేశాలు అంతంత మాత్రమే.. త్వరలో స్పాట్‌ అడ్మిషన్స్‌

Degree Admissions
Degree Admissions

తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న డిగ్రీ కళాశాలల్లో ఓఏఎమ్‌డీసీ ద్వారా జరిగిన మూడు విడతల అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, పద్మావతి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల, ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలల్లో ప్రవేశాలు అంతంతమాత్రంగానే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

LLB Exams: ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

పూర్తి స్థాయిలో అడ్మిషన్లు జరగకపోవడానికి ప్రధాన కారణం టీటీడీ యాజమాన్య కళాశాలల్లో సీట్లకు తగ్గట్టు హాస్టల్‌ వసతి లేకపోవడమే. ఇప్పటికే ఎస్వీ, ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలల్లోనూ, ఎస్పీడబ్ల్యూ కళాశాలలో గత ఏడాది అదనంగా నూతన హాస్టల్‌ భవనాలను నిర్మించారు.

Free training on computer skills: కంప్యూటర్‌ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ.. నెలకు రూ. 15వేల వేతనం

అయినప్పటికీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లకు తగ్గట్టు హాస్టల్‌ వసతి కల్పించలేదు. దీంతో విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు పొంది టీసీ తీసుకుని వెళ్తున్నారు.

AP TET 2024 Exams : ఈనెల 3 నుంచి టెట్‌ పరీక్షలు... హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారా?

త్వరలో స్పాట్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌
టీటీడీ యాజమాన్య కళాశాలల్లో మిగిలి ఉన్న సుమారు 1,143 సీట్ల భర్తీ కోసం త్వరలో స్పాట్‌ అడ్మిషన్ల పేరుతో మరో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులకు హాస్టల్‌ వసతి, ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యాలు వర్తించవు. ఎలాగైనా పూర్తి స్థాయిలో సీట్లను భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.

Published date : 30 Sep 2024 05:23PM

Photo Stories