Nursing Course : నర్సింగ్‌లో విస్తృత కెరీర్ అవకాశాలు.. ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఈ కోర్సుల్లో ప్రవేశం
నర్సింగ్ సేవలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది! ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఈ కొలువులో చేరిన వారికి వేతనాలు సైతం భారీ స్థాయిలో అందుతున్నాయి! ఈ నేపథ్యంలో.. నర్సింగ్ సేవలకు ప్రాధాన్యం, ఈ రంగంలో కెరీర్ అవకాశాలు, అకడమిక్ మార్గాలు తదితర వివరాలు..
ప్రస్తుతం ఇంటర్మీడియెట్ మొదలు బ్యాచిలర్, పీజీ అర్హతతో పలు స్థాయిల్లో నర్సింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బీఎస్సీ నర్సింగ్‌లో చేరేందుకు బైపీసీ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వైద్యకోర్సులకు ప్రత్యామ్నాయంగానూ నర్సింగ్ కోర్సులను ఎంచుకుంటున్నారు.
AP 10th Class Marks Memo : పదో తరగతి మార్కుల విషయంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఇలా..
ఎంపీహెచ్‌డబ్ల్యూ/ఏఎన్‌ఎం
ఇంటర్మీడియెట్ అర్హతతోనే నర్సింగ్ వృత్తిలోకి అడుగు పెట్టేందుకు మార్గం.. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్/ఆగ్జిలరీ నర్స్ మిడ్‌వైఫ్. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇంటర్మీడియెట్‌లోని అన్ని గ్రూప్‌ల విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. విద్యార్థులు చేరాలనుకుంటున్న విద్యా సంవత్సరంలో డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లలోపు వయసుండాలి. వీటి ప్రవేశాలను రాష్ట్రాల స్థాయిలో కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో మెరిట్ జాబితా రూపొందించి సీటు కేటాయిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో కొలువులు లభిస్తాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అవకాశాలు అందుకోవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
జీఎన్‌ఎం
నర్సింగ్ వృత్తిలో అడుగు పెట్టాలనుకునే వారికి ఇంటర్మీడియెట్ అర్హతతోనే అవకాశం కల్పించే మరో కోర్సు.. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ(జీఎన్‌ఎం). ఈ కోర్సు వ్యవధి ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌తో కలిపి మొత్తం మూడేళ్లు. రాష్ట్రాల స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నేతృత్వంలో సీట్లు భర్తీ చేస్తారు. ఇంటర్మీడియెట్‌లో పొందిన మార్కుల ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి.. మెరిట్ జాబితా రూపొందించి సీటు కేటాయిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారు ఉన్నత విద్య కోసం పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌లో చేరే వీలుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంక్షేమ గృహాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
బీఎస్సీ నర్సింగ్
బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్ట్‌గా కలిగిన వారు బీఎస్సీ నర్సింగ్‌లో చేరేందుకు అర్హులు. రాష్ట్రాల స్థాయిలో పారా మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్, స్టేట్ హెల్త్ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించే ఆన్‌లైన్ ప్రవేశ ప్రక్రియ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. ఇంటర్మీడియెట్‌లో పొందిన మార్కులు, ఈఏపీసెట్ (బైపీసీ స్ట్రీమ్) ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసుకున్న వారికి నేరుగా నర్సులుగా కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. ప్రారంభంలోనే నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకూ వేతనం అందుతుంది.
Jobs at Children Home : చిల్డ్రన్ హోమ్‌లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలు
పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ డిప్లొమా
నర్సింగ్‌లో ఉన్నత విద్య, కెరీర్ కోణంలో మంచి అవకాశాలు కల్పించే కోర్సు.. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ డిప్లొమా. జీఎన్‌ఎం అండ్ మిడ్‌వైఫరీ కోర్సుల ఉత్తీర్ణులు ఇందులో చేరేందుకు అర్హులు. ఇందులో స్పెషలైజేషన్ సబ్జెక్ట్‌లను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అభ్యర్థులు అంకాలజీ, ఆపరేషన్ రూమ్, ఆర్థోపెడిక్ అండ్ రిహాబిలిటేషన్, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్ తదితర స్పెషలైజేషన్లను అభ్యసించొచ్చు.
పీజీ స్థాయిలో ఎమ్మెస్సీ నర్సింగ్
పీజీ స్థాయిలో ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సు అందుబాటులో ఉంది. రెండేళ్ల వ్యవధిలోని ఈ కోర్సులో.. మెడికల్ సర్జన్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, పిడియాట్రిక్స్, సైకియాట్రిక్ నర్సింగ్, ఆబ్సె›్టట్రిక్స్ అండ్ గైనకాలజీ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్ తదితర స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. వీరికి ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సూపర్‌వైజర్ల స్థాయిలో ఉద్యోగాలు లభిస్తాయి.
☛ Follow our Instagram Page (Click Here)
ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో
ప్రస్తుతం నర్సింగ్ కోర్సులను రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలతోపాటు జాతీయ స్థాయిలోనూ పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో అభ్యసించే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలోని ఎయిమ్స్(ఢిల్లీ, బోపాల్, పాట్నా, భువనేశ్వర్, రాజ్‌పూర్, రిషికేష్ క్యాంపస్‌లు); ఏఎఫ్‌ఎంసీ–పుణె; జిప్‌మర్ – పుదుచ్చేరి; పీజీఐఎంఆర్–చండీగఢ్ క్యాంపస్‌లు నర్సింగ్ బోధనలో పేరొందిన సంస్థలుగా గుర్తింపు పొందాయి.
ఏఎఫ్‌ఎంసీలో నర్సింగ్.. మిలటరీలో కెరీర్
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్–పుణెలో బీఎస్‌సీ నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థినులకు మిలటరీలోనే కొలువు లభిస్తుంది. కోర్సులో చేరే సమయంలోనే 60 శాతం మందికి షార్ట్ సర్వీస్ కమిషన్ హోదా కింద సీటు కేటాయిస్తారు. వారు కోర్సు పూర్తయ్యాక కనీసం అయిదేళ్లు మిలటరీ నర్సింగ్ సర్వీస్‌లో విధులు నిర్వహిస్తామని బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్ల భర్తీ చేస్తారు.
Anganwadi Posts : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ పోస్టులు
పీహెచ్‌డీ
నర్సింగ్‌లో పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. సైకియాట్రిక్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, మెడికల్ సర్జికల్ నర్సింగ్, పిడియాట్రిక్ నర్సింగ్ స్పెషలైజేషన్స్‌కు పీహెచ్‌డీలో ప్రాధాన్యం నెలకొంది. ఆయా స్పెషలైజేషన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి నర్సింగ్ ప్రొఫెసర్లుగా, ఫార్మా, హెల్త్‌కేర్ సంస్థల్లో ఆర్ అండ్ డీ విభాగాల్లో పర్యవేక్షణ స్థాయిలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.
ఆకర్షణీయ వేతనాలు
దేశంలో నర్సింగ్ నిపుణులకు ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖల పరిధిలోని ఆసుపత్రుల్లో చేరిన వారికి ప్రస్తుత పే కమిషన్ ప్రకారం–బేసిక్ పే రూ.44,900గా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఆసుపత్రులు, సంక్షేమ వసతి గృహాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో నర్సుల నియామకాలు జరుగుతున్నాయి. వీరికి నెలకు రూ. 25 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం ఉంటోంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
విదేశీ అవకాశాలు
నర్సింగ్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులు పూర్తి చేసిన వారికి విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రధానంగా యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా దేశాల్లో నర్సులకు డిమాండ్ నెలకొంది. ఈ దేశాల్లో కెరీర్ సొంతం చేసుకోవాలంటే.. ఆయా దేశాలు నిర్వహించే లైసెన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కెనడాలో నర్సుగా ఉపాధి కోరుకునే వారు ఆ దేశం నిర్వహించే కెనడియన్ రిజిస్టర్డ్ నర్సెస్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్ భాష నైపుణ్యం కూడా తప్పనిసరి. టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ వంటి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్లు సాధించాల్సి ఉంటుంది. ఇలా విదేశీ కెరీర్ సొంతం చేసుకున్న వారికి నెలకు రూ. 2 లక్షల వరకు వేతనం లభిస్తోంది.
కార్పొరేట్ కొలువులు
కార్పొరేట్ ఆసుపత్రుల విస్తరణతో బ్యాచిలర్, పీజీ స్థాయి నర్సింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పీజీ స్థాయిలో అభ్యర్థులు చదివిన స్పెషలైజేషన్ ఆధారంగా నెలకు రూ.40 వేల వరకు వేతనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. బీఎస్‌సీ నర్సింగ్ చేసిన వారికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తోంది.
Tags
- nursing course
- Career Opportunities
- intermediate eligible
- Nursing Jobs
- Medical students
- education in nursing field
- govt and private medical sectors
- huge demand in nursing
- admissions in nursing courses
- Education News
- Sakshi Education News
- NursingServices
- NursingCareers
- NursingEducation
- NursingSalary
- HealthcareCareers
- NursingRecruitment
- NursingVacancies
- PublicHealth
- PrivateSectorNursing
- NursingProfession
- CareerOpportunities
- NursingDegrees
- FutureOfNursing
- NursingSpecialties
- SakshiEducationUpdates